థ్యాంక్స్ మీట్ లో ఎమోషనల్ అయిన హరీష్!

మరిన్ని వార్తలు

దువ్వాడ జగన్నాధం చిత్రంతో తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్న దర్శకుడు హరీష్ శంకర్ నిన్న జరిగిన ఆ చిత్రం థ్యాంక్స్ మీట్ లో ఒక సుదీర్గ ఎమోషనల్ స్పీచ్ ఇచ్చాడు.

అయితే దీనికి గల ముఖ్య కారణం, సినిమా రిలీజ్ రోజున వచ్చిన నెగటివ్ రివ్యూస్ తో పాటు యాంటీ ఫ్యాన్స్ మిక్స్డ్ టాక్ ప్రచారం చేయడమే. అయితే టాక్ కి బిన్నంగా ఈ చిత్రం వసూళ్ళ పరంగా రికార్డ్స్ సృష్టిస్తున్న తరుణంలో హరీష్ తనదైన శైలిలో మాట్లాడి అందరిని అలరిస్తూనే కౌంటర్స్ వేయడం గమనార్హం.

ఇక తను ఫ్యాన్ గా ఉన్నప్పటి పరిస్థితులు ఇప్పుడు ఫ్యాన్స్ మధ్య తలెత్తుతున్న పరిస్థితులని వివరిస్తూ, టెక్నాలజీని ఫేస్బుక్ అలాగే ట్విట్టర్ లలో కొట్టుకోవడానికి ఉపయోగించకండి అని చెప్పుకొచ్చాడు.

అదే విధంగా తన సినిమాల్లో డైలాగ్స్ డబల్ మీనింగ్ తో ఉన్నవే కాకుండా అంతర్లీనంగా మెసేజ్ ఇచ్చేవి కూడా ఉంటాయి అని, దురదృష్టవశాత్తూ అవి ఎక్కువ మంది గుర్తించరు అంటూఒకింత అసహనం వ్యక్తం చేశాడు.

ఈ ఫంక్షన్ పూర్తయ్యాక- అల్లు అర్జున్ తన ట్విట్టర్ లో ఈ స్పీచ్ పై స్పందిస్తూ- నేను విన్న గొప్ప స్పీచెస్ లో ఇదొకటి అని హరీష్ ని మెచ్చుకున్నాడు.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS