మహేష్ బాబు.. టాలీవుడ్ సూపర్ స్టార్. తనతో సినిమా చేయాలని ప్రతీ దర్శకుడికీ ఉంటుంది. అందుకే మహేష్ కోసం అన్ని కథలు రెడీ అవుతున్నాయి. తాజాగా హరీష్ శంకర్ సైతం మహేష్ కోసం ఓ కథ సిద్ధం చేసుకున్నట్టు టాక్. హరీష్ శంకర్ పవన్ కల్యాణ్ కి డై హార్డ్ ఫ్యాన్. ఏ కథ రాసుకున్నా- పవన్ ని దృష్టిలో ఉంచుకునే రాసుకుంటానని చాలాసార్లు చెప్పాడు. అయితే తొలిసారి మరో హీరో కోసం ఓ కథ రాశాడట. ఆ హీరో మహేష్ బాబునే.
గబ్బర్ సింగ్ తరవాత.. హరీష్ శంకర్ కి చాలా ఆఫర్లు వచ్చాయి. అందులో మహేష్ సినిమా కూడా ఉందని అప్పట్లో చెప్పుకున్నారు. అయితే... రామయ్యా వస్తావయ్యా ఫ్లాప్ తో ఆ ఆఫర్లన్నీ వెనక్కి వెళ్లిపోయాయి. లేదంటే అప్పుడే మహేష్ తో సినిమా తీయాల్సింది. ప్రస్తుతం పవన్ కల్యాణ్ తో ఓ సినిమా చేస్తున్నాడు హరీష్. ఇది గనుక మళ్లీ గబ్బర్ సింగ్ రేంజ్ లో ఆడితే - హరీష్ కి మళ్లీ భారీ అవకాశాలు రావడం ఖాయం. ఈసారి మాత్రం.. గన్ షాట్ గా హిట్టు కొట్టి, ఆ తరవాత మహేష్ తో సినిమా చేయాలని హరీష్ ఫిక్సయిపోయినట్టు టాక్. చూద్దాం.. ఏమవుతుందో?