గబ్బర్ సింగ్ లాంటి విజయాన్ని అందించిన దర్శకుడు హరీష్ శంకర్. తనంటే.. పవన్ ఫ్యాన్స్‌కి ప్రత్యేకమైన అభిమానం. హరీష్‌కి కూడా పవన్ అంటే గౌరవం, భక్తి. హరీష్ తో మరో సినిమా చేయాలని పవన్ కూడా అనుకొంటూనే ఉన్నాడు. కానీ కుదరడం లేదు. `భవదీయుడు భగత్‌సింగ్` టైటిల్ ఎనౌన్స్ చేసి ఇంత కాలమైనా, దీనిపై ఎలాంటి అప్‌డేట్ లేదు. `ఇదిగో... అదిగో` అని ఊరించారు కానీ..ఫలితం కనిపించలేదు. ఈ ప్రాజెక్టు ఆగిపోయిందని ఇండస్ట్రీ వర్గాల టాక్. హరీష్ కూడా మరో హీరోని చూసుకొని, స్క్రిప్టు రెడీ చేసుకోవడంలో బిజీగా ఉండిపోయాడు. మధ్యలో పవన్‌తే `తేరి` రీమేక్ చేస్తారని ప్రచారం జరిగింది. అది కూడా సైడ్‌కి వెళ్లిపోయింది.
అయినా సరే.. పవన్‌పై హరీష్ ఆశలు వదులుకోలేదని టాక్. పవన్ తో మరో ప్రాజెక్టు చేయడానికి రెడీ అయ్యాడట. ఈసారి.. కథ.. హరీష్‌ది కాదు. పవన్ కల్యాణ్‌దే. ఇటీవల.. హరీష్ - పవన్‌ల మధ్య భేటీ జరిగిందని టాక్. పవన్ ఓ లైన్ చెప్పి, డవలప్ చేసుకొని రమ్మన్నాడట, హరి హర వీరమల్లు పూర్తయ్యేనాటికి స్క్రిప్టు రెడీ అయిపోతే.. ప్రాజెక్టు ఆన్‌లో ఉంటుందని తెలుస్తోంది. అందుకే హరీష్ శంకర్ ఇప్పుడు ఆఘమేఘాల మీద స్క్రిప్టు డవలప్ చేసే పనిలో ఉన్నాడని టాక్. ఈ మూడు నెలల లోపు హరీష్ పవన్‌ని ఒప్పిస్తాడో, లేదో చూడాలి.