చిరంజీవి వాల్తేర్ వీరయ్య, బాలకృష్ణ వీరసింహారెడ్డి సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. చాలా రోజుల తర్వాత చిరు, బాలయ్యలు ఒకేసారి బాక్సాఫీసు ముందుకు రావడంతో సహజంగానే అభిమానుల్లో ఒక ఆసక్తి. రెండు సినిమాలు ప్రమోషన్స్ మొదలుపెట్టాయి. వాల్తేర్ వీరయ్య ఫస్ట్ సింగిల్ బాస్ పార్టీ మొన్న విడుదలైయింది. తాజాగా వీరసింహారెడ్డి జైబాలయ్య పాట బయటికి వచ్చింది. అయితే ఈ రెండు పాటలకీ పుల్ మార్కులు పడలేదు.
బాస్ పార్టీ ప్రోమో విడుదలైనప్పుడే తేడా కొట్టింది. దేవిశ్రీ పాడిన సాకీపై చాలా నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి. పాట రాసింది కూడా ఆయనే. ట్యూన్ లో పదాల పొందిక సరిగ్గా కుదరలేదు. అయితే అదే వెరైటీ అనుకున్నారేమో కానీ విన్న ఫ్యాన్స్ మాత్రం అవాకయ్యారు. పూర్తి పాట వచ్చిన తర్వాత చిరు చేసిన డ్యాన్స్ మూమెంట్స్ ఓకే అనిపించాయి కానీ బాస్ పార్టీకి తగ్గ ట్యూన్ అయితే దేవిశ్రీ ఇవ్వలేదనే కామెంట్స్ వినిపించాయి. పైగా ఇది వరకూ దేవిశ్రీ చేసిన అనేక పాటల రిఫరెన్స్ బాస్ పార్టీలో కనిపించాయి.
జై బాలయ్య పరిస్థితి కూడా ఇదే. తమన్ మంచి ఫామ్ లో వున్నాడు. అరదగొడతాడని నమ్మకం పెటుకున్న ఫ్యాన్స్ కి కొంత నిరాశ ఎదురైయింది. ఇది వరకు బోలెడు సార్లు విన్న బీట్ ని కంపోజ్ చేసి దాన్నే జై బాలయ్యగా వదిలాడు. బాలయ్య లుక్ రాయల్ గా వున్నా.. స్కోర్ లో ఎలాంటి కొత్తదనం కనిపించలేదు. పైగా ఒసేయ్ రాములమ్మ పాటని కాపీ కొట్టేశారనే నింద కూడా మోయాల్సివస్తోంది. తమన్ కి కాపీ మరకలు కొత్తకాదు కానీ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్న కాపీ మీమ్స్ బాలయ్య ఫ్యాన్స్ కి చిరాకు తెప్పిస్తున్నాయి. మొత్తానికి అటు బాస్ పాట, ఇటు బాలయ్య పాట రెండూ తేలిపోయాయి.