ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ ఏంటి ఇలా అంటున్నాడు అని అనుకుంటున్నారా? అయితే ఈ క్రింది వార్తని చదవండి.
ఇటీవలే జరిగిన ఒక సర్వేలో 2017లో విడుదలైన చిత్రాలలో ఎక్కువగా పైరసీ కి గురైన చిత్రాలలో తెలుగు నుండి బాహుబలి 2, దువ్వాడ జగన్నాధం & అర్జున్ రెడ్డి ఉన్నాయంటూ తేలింది. ఈ వార్త ఎవరో దర్శకుడు హరీష్ శంకర్ కి పంపడంతో ఆయన ‘ఖర్మ’ అంటూ ఈ విషయాన్నీ పోస్ట్ చేశాడు.
ఇప్పుడు ఈ వార్త పెను సంచలనంగా మారింది. అసలే చిత్రపరిశ్రమని పైరసీ పెను భూతం పట్టి పీడిస్తున్న నేపధ్యంలో ఇలాంటి ఒక వార్త ఇప్పుడు అందరిని షాక్ కి గురి చేసేదిలా ఉంది. ఎన్ని సార్లు పైరసీని అరికట్టడానికి ప్రయత్నాలు మొదలుపెట్టినా అవి పూర్తి స్థాయిలో ఫలితాలని ఇవ్వలేకపోతున్నాయి.
మొత్తానికి ఈ మూడు చిత్రాలు కలెక్షన్స్ పరంగానే కాకుండా పైరసీ గా కూడా రికార్డు సృష్టించాయి.