అఖిల్‌ ఈ సారి ఏం చేయబోతున్నావ్‌.

మరిన్ని వార్తలు

తొలి సినిమా కోసం పక్కా మాస్‌ ఎంటర్‌టైనర్‌ని ఎంచుకున్నాడు అక్కినేని అందగాడు అఖిల్‌. రెండో సినిమాకి కొంచెం క్లాస్‌ టచ్‌ కోసం ఆరాటపడ్డాడు. కానీ క్లాస్‌, మాస్‌ రెండూ అఖిల్‌కి అచ్చొచ్చినట్లు లేవు. రెండింటితోనూ డీలా పడ్డాడు. దాంతో ఇప్పుడు ఏ సబ్జెక్ట్‌ని ఎంచుకోవాలా అనే విషయంపై అఖిల్‌ ఎక్కువ కాన్‌సన్‌ట్రేషన్‌ చేశాడు. ఆ కోవలోనే కాస్త కన్‌ఫ్యూజన్‌లో పడ్డాడు అఖిల్‌. 

అందుకే ఇంత ఎక్కువ టైం తీసుకోవాల్సి వచ్చింది మూడో సినిమాకి. ఎట్టకేలకు హిట్‌ డైరెక్టర్‌ వెంకీ అట్లూరిని లైన్‌లో పెట్టాడు. 'తొలిప్రేమ' సినిమాతో వెంకీ అట్లూరి మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇప్పుడు అఖిల్‌ కోసం ఎలాంటి స్టోరీ ప్రిపేర్‌ చేయనున్నాడో. అఖిల్‌ ఈ సారి ఏం చేస్తాడో చూడాలి మరి. లాంఛింగ్‌, రీ లాంచింగ్‌ అంటూ రెండు సినిమాలతోనూ అఖిల్‌ నిరాశపెట్టాడు. ఈ సారి ముచ్చటగా మూడో సినిమాగా రానున్న ఈ సినిమా స్టోరీ ఎలా ఉండబోతోంది. అఖిల్‌ ఎలా కనిపించనున్నాడు అనే విషయాలపై అక్కినేని అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది.

 

అయితే ఈ సినిమా కోసం అఖిల్‌ పక్కా లెక్కలతో వస్తున్నాడనీ తెలుస్తోంది. చాలా ఈక్వేషన్స్‌ ప్లాన్‌ చేశాడట మాంచి కమర్షియల్‌ హిట్‌ కోసం. కొన్ని సెంటిమెంట్లు ఫాలో అవుతున్నాడట అఖిల్‌ ఈ సినిమా కోసం. అవేంటో ప్రస్తుతానికి సస్పెన్సే కానీ, పక్కా ప్రణాళిక సిద్ధం చేసినట్లయితే తెలుస్తోంది. తొలి సినిమా కోసం సాయేషా సైగల్‌ని టాలీవుడ్‌కి పరిచయం చేశాడు అఖిల్‌. రెండో సినిమాకి కళ్యాణీ ప్రియదర్శన్‌ని తీసుకొచ్చాడు. ఇప్పుడు ఏ కొత్త భామని అఖిల్‌ పరిచయం చేయనున్నాడో చూడాలి మరి.
 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS