మెగా కాంపౌండ్ నుండి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తదితర హీరోలతో సినిమాలు చేశాడు. మెగా రాకుమారుడు వరుణ్‌తేజ్‌తో తొలిసారిగా 'గద్దలకొండ గణేష్' సినిమాని తెరకెక్కించాడు. మెగా కాంపౌండ్ హీరోల్లో ఒక్క అల్లు అర్జున్‌తో తప్ప హరీష్ శంకర్‌కి మిగిలిన హీరోలతో బ్లాక్ బాస్టర్ హిట్సే ఉన్నాయి. ఇదిలా ఉంటే, లేటెస్ట్‌గా ప్రేక్షకుల ముందుకొచ్చిన 'గద్దలకొండ గణేష్' ఏ రేంజ్‌లో బాక్సాఫీస్‌ని షేక్ చేస్తుందో చూస్తూనే ఉన్నాం.
అయితే, ఈ ఒక్క సినిమా కోసమే అని కాదు కానీ, వరుణ్‌తేజ్, హరీష్ శంకర్‌ని బాగా ఇంప్రెస్ చేసేశాడట. దాంతో వరుణ్ కోసం మరో స్టోరీ తయారు చేయాలనుకుంటున్నాడట హరీష్ శంకర్. ఆ సినిమాని ప్యాన్ ఇండియన్ మూవీగా రూపొందించాలనుకుంటున్నాడట. తెలుగు ప్రేక్షకుల్ని ఆల్రెడీ దోచేశాడు వరుణ్ తేజ్. ఇక తదుపరి చేయబోయే ప్రాజెక్ట్‌తో మిగిలిన భాషల్లో కూడా వరుణ్‌కి మార్కెట్ ఫామ్ చేయాలనే యోచనలో హరీష్ ఉన్నట్లు అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం.
వరుణ్‌లోని మేకోవర్ అన్ని వర్గాల, అన్ని భాషల ప్రేక్షకుల్నీ ఆకట్టుకునేలా ఉంటుందని హరీష్ శంకర్ అంటున్నాడు. సో త్వరలోనే వరుణ్‌తో ఆ టైప్ సబ్జెక్ట్ ప్లాన్ చేసేందుకు ఆల్రెడీ స్కెచ్ ప్రిపేర్ చేస్తున్నాడట. ప్రస్తుతం 'గద్దలకొండ గణేష్' సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా పాల్గొంటున్నారు వరుణ్ అండ్ హరీష్ శంకర్. ఈ సినిమా జోరు 'సైరా' వచ్చేంతవరకూ కొనసాగడం ఖాయం. ఆ తర్వాత తదుపరి ప్రాజెక్ట్‌పై వర్క్ చేయనున్నాడట హరీష్ శంకర్. ఇదంతా చూస్తుంటే, వరుణ్‌ని ప్యాన్ ఇండియన్ స్టార్‌ని చేసేదాకా హరీష్ వదిలిపెట్టేలా లేడనిపిస్తోంది.