'అల వైకుంఠపురములో' సర్‌ప్రైజ్‌ ఇదే!

మరిన్ని వార్తలు

అల్లు అర్జున్‌ తాజా చిత్రం 'అల వైకుంఠపురములో' నుండి సర్‌ప్రైజ్‌ వచ్చేసింది. ఈ సినిమాలోని 'సామజవరగమనా..' అనే పాట లిరికల్‌ సాంగ్‌ రిలీజ్‌ చేసింది చిత్ర యూనిట్‌. లిరికల్‌ సాంగ్‌లో పూజా హెగ్దే, రాహుల్‌ రామకృష్ణ, నవదీప్‌తో అల్లు అర్జున్‌ కలిసి ఉన్న స్టిల్స్‌ చూపించారు. నవదీప్‌ ఈ సినిమాలో విలన్‌గా కనిపించనున్నాడన్న టాక్‌ వినిపించింది. అయితే, అల్లు అర్జున్‌తో పాటు ఫ్రెండ్లీగా ఉన్న స్టిల్స్‌ చూస్తుంటే, నవదీప్‌ విలన్‌ కాదు, హీరో ఫ్రెండ్‌ అని తెలుస్తోంది.

 

ఇక రాహుల్‌ రామకృష్ణకు కూడా ఈ సినిమాలో మంచి రోల్‌ దక్కినట్లే ఉంది. తమన్‌ సంగీతమందించిన ఈ పాటకు మంచి రెస్పాన్స్‌ వస్తోంది. అయితే, 'అరవింద సమేత..', అజ్ఞాతవాసి', 'ఆర్య 2' ఫ్లేవర్స్‌ కనిపిస్తున్నాయి విజువల్‌లో. ఆఫీస్‌ సెట్టింగ్‌, హీరో ఆటిట్యూడ్‌ ఇదంతా చూస్తుంటే, ఆయా సినిమాల ఫ్లేవర్స్‌ ఎగ్జాట్‌గా కనిపిస్తున్నాయన్న అభిప్రాయం ఆడియన్స్‌లో మెదులుతోంది.

ఫుల్‌ ఫన్‌ అండ్‌ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాని రూపొందిస్తున్నాడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌. పూజా హెగ్దేతో పాటు, నివేదా పేతురాజ్‌ మరో హీరోయిన్‌గా నటిస్తోంది. సీనియర్‌ నటి టబు కీలక పాత్ర పోషిస్తోంది. హారికా హాసిని క్రియేషన్స్‌ బ్యానర్‌లో, అల్లు అరవింద్‌ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. సంక్రాంతికి సినిమాని విడుదల చేయనున్నారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS