హరీష్ శంకర్ చేతిలో బడా ప్రాజెక్ట్స్

మరిన్ని వార్తలు

గబ్బర్ సింగ్ తో సాలిడ్ హిట్ కొట్టిన హరీష్ శంకర్, మళ్ళీ  పవన్ కళ్యాణ్ నే నమ్ముకుని ఇన్నాళ్లు వెయిట్ చేశాడు. 'ఉస్తాద్ భగత్ సింగ్' షూటింగ్ 70 పర్సెంట్ కంప్లీట్ అయినా, పవన్ పాలిటిక్స్ లో బిజీగా ఉండటం వలన ఆ షూటింగ్ కి బ్రేక్ పడింది. ఏపీ ఎన్నికలు పూర్తి అయిన తరువాత తిరిగి ఉండటంతో, హరీష్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ని లైన్ లో పెట్టాడు.  రవితేజతో మిస్టర్ బచ్చన్ మూవీని పట్టాలెక్కిస్తున్నాడు. ఈ మూవీ బాలీవుడ్ లో వచ్చిన రైడ్ కి రీమేక్ అన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇంకో రెండు బిగ్ ప్రాజెక్టులను కూడా లైన్లో పెట్టాడు. రవితేజ  లేటెస్ట్ మూవీ “ఈగల్” సక్సెస్ మీట్ కు హరీష్ శంకర్ కూడా హాజరయ్యారు. ఈ ఈవెంట్లో ఆయన మాట్లాడుతూ తాను నెక్స్ట్ రెండు పెద్ద సినిమాలు చేయబోతున్నట్టుగా ప్రకటించారు.


మెగా ఫామిలీ అంటే హరీష్ శంకర్ కి ప్రత్యేక అభిమానం. ఇప్పటికే మెగా హీరోలు అందరితో సినిమాలు తీసిన, హరీష్ ఇప్పుడు  మెగాస్టార్ చిరంజీవితో వర్క్ చేయటానికి రెడీ అయ్యాడు. భోళాశంకర్ మూవీ ఫ్లాప్ తరవాత చిరు సెలెక్టెడ్ గా కథలు ఎంచుకుంటున్నాడు. ఇలాంటి టైం లో హరీష్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడంటే కచ్చితంగా కథ వేరే లెవెల్ లో ఉండి ఉంటుందని టాక్.   హరీష్ తన రెండవ ప్రాజెక్ట్ బాలీవుడ్  స్టార్ హీరో సల్మాన్  ఖాన్ తో చేయనున్నాడని సమాచారం.
  

చిరుతో చేయబోయే సినిమాకి డైరెక్టర్, రచయిత బివిఎస్ రవి కథ అందిస్తున్నాడు. చిరు కూతురు సుస్మిత, పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో కలిసి ఈ మూవీ నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ పూర్తి అయ్యాక సల్మాన్ ఖాన్ సినిమా ఉంటుందని తెలుస్తోంది. మొత్తానికి హరీష్ ఇన్నాళ్ళకి లైన్లో పడ్డాడని, ఫాన్స్ ఆనందంగా ఉన్నారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS