ఏదన్నా విషయంపై స్పందించాల్సి వచ్చినప్పుడు మాటల్ని తూటాల్లా వాడుతుంటాడు దర్శకుడు హరీష్ శంకర్. ఇటీవలే 'గద్దలకొండ గణేష్' సినిమాతో హిట్టు కొట్టిన హరీష్ శంకర్, తాజాగా సోషల్ మీడియాలో చేసిన ఓ పోస్టింగ్ ట్రెండింగ్‌గా మారుతోంది. ఆయనపై ప్రశంసల జల్లు కురుస్తోంది. ఇటీవల తెలంగాణలో జరిగిన 'దిశ' ఘటనకు సంబంధించిన నిందితుల్ని పోలీసులు ఎన్‌కౌంటర్ చేయడంపై హరీష్ శంకర్ సోషల్ మీడియాలో స్పందించాడు. 'మా ట్రైలర్స్ టీజర్స్ లైక్ చేయకపోయినా ఫర్వాలేదు. ప్లీజ్ ఈ ఎన్‌కౌంటర్ న్యూస్ మాత్రం ట్రెండింగ్ చేయండి.. ఇలా జరిగింది అని చాటింపు వేయండి ప్లీజ్..' అంటూ ఓ ట్వీటేసిన హరీష్, పోలీస్ ఉన్నతాధికారి సజ్జనార్ ఫొటోని తన ప్రొఫైల్ పిక్‌గా పెట్టుకోవడం గమనార్హం.
Maa trailers teasers like cheyalapoyinaa parledhu
— Harish Shankar .S (@harish2you) December 6, 2019
pls ee encounter news Maatram trending cheyandi...... ILA JARIGINDHI ani chaatimpu veyandi pls...... 🙏🙏🙏🙏
హరీష్ మాత్రమే కాదు, పలువురు సినీ ప్రముఖులు దిశ ఘటనలో నిందితుల ఎన్‌కౌంటర్‌ని స్వాగతిస్తున్నారు. హీరో మనోజ్ అయితే, ఆ ఎన్‌కౌంటర్‌లో ఉపయోగించిన బుల్లెట్‌ని దాచుకోవాలన్పిస్తోందంటూ ట్వీటేశాడు. సమంత, జూనియర్ ఎన్టీఆర్.. ఇలా ఒకరేమిటి, మొత్తంగా సినీ పరిశ్రమ ఈ ఎన్‌కౌంటర్ ద్వారా దిశకు న్యాయం జరిగిందని చెబుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశవ్యాప్తంగా మహిళా లోకం, 'మృగాళ్ళకు' తగిన శిక్ష పడింది.. అంటూ నినదిస్తోంది.