గద్దల కొండ గణేష్ తరవాత.. హరీష్ శంకర్ నుంచి మరో సినిమా రాలేదు. ఓ ప్రతిభావంతుడైన దర్శకుడు ఇంతకాలం విరామం తీసుకోవడం, మరో సినిమా చేయకపోవడం నిజంగా విచారించాల్సిన విషయం. కాస్తో కూస్తో పేరున్న ప్రతీ దర్శకుడు ఏదో ఓ ప్రాజెక్టుతో బిజీగా ఉంటున్న ఈ దశలో.. హరీష్ మరో సినిమా చేయకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. అలాగని హరీష్ ఏం ఖాళీగా లేడు. పవన్ కల్యాణ్ కోసం ఓ కథ రెడీ చేసుకొని, ఆయన కాల్షీట్ల కోసం ఎదురు చూస్తున్నాడు. పవన్ - హరీష్ కాంబో అంటే... ఆ క్రేజ్ వేరు. సినిమా పట్టాలెక్కి, బయటకు వస్తే - కచ్చితంగా టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అవుతుంది. పవన్ ఈ సినిమా చేయడానికి ఒప్పుకొన్నా.. కాల్షీట్లు మాత్రం సర్దుబాటు చేయలేకపోతున్నాడు. పవన్ కోసం ఎదురు చూసీ, చూసీ.. హరీష్‌కు కూడా విసుగొచ్చింది. అందుకే ఇప్పుడు మరో ప్రత్యామ్నాయం కోసం ఆలోచిస్తున్నాడు. పవన్ పిలిచి కాల్షీట్లు ఇచ్చేలోగా.. మరో హీరోని చూసుకొని, సినిమాని పట్టాలెక్కించాలన్నది హరీష్ ప్లాన్.
ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో హరీష్‌కు ఇంతకు మించిన ఆప్షన్ లేదు. ఎంత పవన్ కల్యాణ్ అయినా, ఎన్నాళ్లని ఆయన కోసం ఎదురు చూసేది..? అందుకే మరో హీరోని అప్రోచ్ అవ్వాలనుకోవడం సరైన నిర్ణయమే. కానీ.. ఆ మరో హీరో ఎవరన్నది పెద్ద ప్రశ్న. ఇప్పుడు ఉన్న హీరోలంతా తమ తమ ప్రాజెక్టులతో బిజీ బిజీగా ఉన్నారు. ఒకొక్కరూ రెండేసి, మూడేసి సినిమాలు ఒప్పేసుకొన్నారు. వాళ్లంతా ఖాళీ అవ్వాలంటే చాలా కాలం పడుతుంది. కనీసం ద్వితీయ శ్రేణి హీరోలు.. అంటే నాని, వరుణ్‌తేజ్ లాంటి వాళ్లు కూడా ఎవరి సినిమాలతో వాళ్లు బిజీ. ఇలాంటి సమయంలో.. హరీష్‌కు హీరో దొరకడం అంత ఈజీ కాదు. హరీష్ విజయ్ దేవర కొండ కోసం ఓ కథ తయారు చేసుకొన్నాడని ఇండస్ట్రీ వర్గాల టాక్. కాకపోతే... ఇప్పుడున్న పరిస్థితుల్లో విజయ్ దేవరకొండ కాల్షీట్లు దొరకడం కూడా కష్టమే. ఆయన జనగణమనతో బిజీ. మరోవైపు ఖుషీ సినిమా ఉంది. ఇవి కాకుండా.. సుకుమార్‌తో ఓ సినిమా చేయాల్సివుంది. ఇవన్నీ అయ్యాక గానీ.. హరీష్‌కు డేట్లు ఇవ్వలేడు. సో.. పవన్ ని కాదన్నా... హరీష్ దగ్గర మరో ఆప్షన్ లేదన్నమాట.