పుష్ప 2 తో అల్లు అర్జున్ ఇంటర్నేషనల్ స్టార్ అయిపోయాడు. పుష్ప మూవీ తో పాన్ ఇండియా స్టార్ గా మారిన బన్నీ, పుష్ప 2 తో పాన్ వరల్డ్ స్టార్ అయిపోయాడు. నెక్స్ట్ బన్నీ చేయబోయే సినిమా ఏది అని ఫాన్స్ ఎదురుచూస్తున్నారు. బన్నీ నెక్స్ట్ మూవీ త్రివిక్రమ్ తో చేస్తున్న సంగతి తెలిసిందే. మొదటి సారిగా త్రివిక్రమ్ పాన్ ఇండియా సినిమా తీసేందుకు సిద్ధం అవుతున్నాడు. బన్నీ రేంజ్ అలాంటిది మరి. ప్రజంట్ ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న త్రివిక్రమ్ మిగతా నటీ నటుల్ని, టెక్నీషన్స్ ని ఎంపిక చేసే పనిలో ఉన్నట్లు సమాచారం. స్క్రిప్ట్ కంప్లీట్ చేసి టీమ్ తో చర్చల్లో మునిగి తేలుతున్నారట.
ఇప్పటికే బన్నీ త్రివిక్రమ్ కాంబోలో హ్యాట్రిక్స్ ఉన్నాయి. వీరి కలయికలో సినిమా అంటే బ్లాక్ బస్టర్ గ్యారంటీ అన్న అంచనాలు ఉన్నాయి ఫాన్స్ కి. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఈ కాంబో మూవీకి మ్యూజిక్ కోసం 'హ్యారిస్ జైరాజ్' ను రంగంలోకి దించుతున్నారంట త్రివిక్రమ్. ఇప్పటి వరకు త్రివిక్రమ్ సినిమాలకి ఎక్కువగా దేవిశ్రీ చేసేవాడు. తరవాత మిక్కీ జే మేయర్, థమన్, సంగీతం అందించారు. అజ్ఞాతవాసి మూవీకి అనిరుద్ మ్యూజిక్ అందించినా అంతగా కలిసి రాలేదు. ఇప్పటివరకు వచ్చిన త్రివిక్రమ్ సినిమాల్లో పాటలు అన్నీ సూపర్ హిట్. ఇన్ని మ్యూజికల్ హిట్స్ ఇచ్చిన మ్యూజిక్ డైరక్టర్లని, ఇప్పటివరకు తనతో వర్క్ చేసిన వారిని కాదని త్రివిక్రమ్ కొత్తగా హ్యారిస్ కి ఛాన్స్ ఇవ్వటం చర్చనీయాశంగా మారింది.
అయితే దీనికి త్రివిక్రమ్ సమాధానం ఏంటంటే తాను రాసుకున్న కథకు హ్యారిస్ మ్యూజిక్ అయితే పర్ఫెక్ట్ గా ఉంటుందని నమ్ముతున్నాడట. కొంచెం చేంజ్ కూడా ఉంటుందని గురూజీ భావన. హ్యారిస్ ఇప్పటికే తెలుగులో కొన్ని సినిమాలు చేసాడు. అవన్నీ కూడా మ్యూజికల్ హిట్స్. చెర్రీ మూవీ 'ఆరెంజ్', వెంకటేష్ తో 'వాసు' 'ఘర్షణ', ప్రభాస్ 'మున్నా', మహేష్ సైనికుడు సినిమాలకి వర్క్ చేసాడు. హ్యారిస్ జై రాజు ఎక్కువగా గౌతమ్ వాసుదేవ్ మీనన్ సినిమాలకి వర్క్ చేసాడు. ఈమధ్య కొంచెం కెరియర్లో వెనకపడ్డాడు. కానీ రెహమాన్ తర్వాత అంత గుర్తింపు పొందిన సంగీత దర్శకుడు హ్యారిస్ జైరాజ్. తన ఖాతాలో చాలా బ్లాక్ బస్టర్స్ ఉన్నాయి. అందుకే త్రివిక్రమ్ కూడా మొగ్గు చూపుతున్నాడు.