'లాక్ డౌన్' వల్ల లాభపడ్డ అతికొద్ది పరిశ్రమల్లో ఆన్ లైన్ వీడియో స్ట్రీమింగ్ సర్వీసులు మరియు ఓ.టి.టి లు మొదటివి. సినిమాలు థియేటర్ల లో ఉండగానే అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్, జీ5 వంటి ఓ.టి.టిలు ఆన్ లైన్లో విడుదల చేసేవి. అలాంటిది ఇప్పుడు థియేటర్లే లేకపోవడంతో నిర్మాతలు మరియు ప్రేక్షకులు కూడా ఓ.టి.టిల వైపు చూడడం మొదలు పెట్టారు. మార్చ్, ఏప్రిల్ మరియు మే లో విడుదలవ్వాల్సిన చిత్రాలు వాటికి సంబంధించిన నిర్మాతలు ఫైనాన్స్ కు తెచ్చిన డబ్బులకు వడ్డీలు కట్టలేక తెగ ఇబ్బందులు పడుతున్నారు.
ఇక ఈ లాక్ డౌన్ సమయాన్ని క్యాష్ చేసుకున్న ఓ.టి.టి సంస్థలు ఒకదానికి మించి మరొకటి బంపర్ ఫిగర్లు చెప్పి విడుదలకు రెడీగా ఉన్న చిత్రాలను కొనేస్తున్నారు. అలంటి ఒక బంపర్ ఆఫరే రాణా తాజా చిత్రం 'అరణ్య'కు వచ్చిందట. ఏప్రిల్ 2న విడుదల కావాల్సిన ఈ చిత్రాన్ని 'నెట్ ఫ్లిక్' సంస్థ ఒక భారీ ఆఫర్ తో తెగ్గొట్టిందట. త్వరలోనే దీనికి సంబంధించిన ప్రకటన రానుందని టాక్. జోయా హుస్సేన్, శ్రియ పిలగోన్కర్ , విష్ణు విశాల్ ముఖ్యపాత్రల్లో నటించిన ఈ చిత్రం హిందీలో 'హాథీ మేరా సాథీ' పేరుతో, తమిళంలో 'కాదన్' పేరుతో విడుదల కానుంది.