ఇప్పటికే గోల్డెన్ గ్లోబ్ అందుకొని, ఆస్కార్‌కు అడుగు దూరంలో ఉన్న మన తెలుగు సినిమా... ఆర్.ఆర్.ఆర్. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో పోటీ పడుతోంది.
ఈలోగా అంతర్జాతీయంగా అవార్డుల్ని గెలుచుకోవడంలో దృష్టి పెట్టింది. ఇప్పటికే పలు వేదికలపై ఆర్.ఆర్.ఆర్ అవార్డులు అందుకొంది. తాజాగా ఆర్.ఆర్.ఆర్ ఖాతాలో మరో ఐదు అంతర్జాతీయ పురస్కారాలు చేరాయి. హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ ప్రకటించిన అవార్డుల జాబితాలో ఐదు విబాగాల్లో గెలుపొందింది. బెస్ట్ యాక్షన్, బెస్ట్ స్టంట్స్, బెస్ట్ ఒరిజినల్ సాంగ్, బెస్ట్ ఇంటర్నేషనల్ సాంగ్‌తోపాటు స్పాట్ లైట్ అవార్డును కూడా అందుకున్నారు రాజమౌళి అండ్ టీమ్. రాజమౌళి, రామ్‌చరణ్ తదితరులు ఈ వేడుకలో భాగమయ్యారు. ‘బెస్ట్ యాక్షన్ ఫిల్మ్’ కేటగీరీలో ఏరియల్ కంబాట్ ఫిల్మ్ ‘టాప్ గన్: మేవరిక్’, ‘బ్లాక్ పాంథర్’, ‘బ్యాట్ మ్యాన్’, ‘విమెన్ కింగ్’ ఉన్నప్పటికీ ఆ సినిమాలను పక్కకు నెట్టి ‘ఆర్‌ఆర్‌ఆర్’ ‘బెస్ట్ యాక్షన్ ఫిల్మ్’ అవార్డు సొంతం చేసుకోవడం విశేషం.