మంచు మనోజ్ రెండో పెళ్లి చేసుకొంటున్నాడన్న వార్తలు ఎప్పటి నుంచో షికారు చేస్తున్నాయి. భూమా మౌనిక రెడ్డిని మనోజ్ పెళ్లాడతాడని ఇప్పటికే రకరకాల వార్తలు బయటకు వచ్చాయి. ఇద్దరూ కలిసి గుళ్లూ, గోపురాలకు తిరగడంతో ఈ వార్తలకు మరింత ఊతం వచ్చింది. అనుకొన్నట్టే.. ఇద్దరూ ఒక్కటవ్వబోతున్నారు. మార్చి 3న వీరిద్దరి వివాహం జరపాలని పెద్దలు నిర్ణయించారు. ఇటీవలే... మనోజ్ - మౌనికల ప్రీ వెడ్డింగ్ ఫంక్షన్ కూడా చాలా గ్రాండ్ గా జరిగిందట. పెళ్లి మాత్రం సింపుల్ గా చేయాలని నిర్ణయించుకొన్నారు. మనోజ్‌కి ఇది రెండో పెళ్లి.
తొలి భార్యకు ఇది వరకే విడాకులు ఇచ్చారు. మౌనికకు సైతం ఇది రెండో పెళ్లే. ఆమె కూడా ఇది వరకు విడాకులు తీసుకొన్నారు. మంచు, భూమా కుటుంబాల మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. దాంతో పాటు మనోజ్, మౌనిక ఇద్దరూ మంచి స్నేహితులు. అలా ఈ సంబంధం కలిసింది.