సుదీర్ఘ విరామం తరవాత... మంచు మనోజ్ రీ ఎంట్రీ ఇస్తున్నాడు. `అహం బ్రహ్మస్మి` సినిమాతో. యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న సినిమా ఇది. దీనికి నిర్మాత కూడా మనోజే. ఈ సినిమాపై మనోజ్ చాలా ఆశలు పెట్టుకున్నాడు. మిగిలిన భాషల్లోనూ ఈ సినిమాని విడుదల చేస్తున్నాడు. తన మార్కెట్ కి మించి ఈసినిమా కోసం ఖర్చు పెడుతున్నాడు. ఒక్క ఫైటు కోసం ఏకంగా ఆరు కోట్లు ఖర్చు చేస్తున్నాడు. ఈ ఫైట్ని పీటర్ హెయిన్స్ ఆధ్వర్యంలో తెరకెక్కిస్తారు.
ఈ ఒక్క ఫైటునీ యాభై రోజుల పాటు తెరకెక్కిస్తార్ట. ఈ ఫైటు కనీసం 8 నుంచి 10 నిమిషాల పాటు ఉంటుందని, ఆ ఫైటు కోసం మనోజ్ కర్రసాము, కత్తిసాము నేర్చుకుంటున్నాడట. లాక్ డౌన్ ఎత్తేసిన వెంటనే ఈ ఫైటుని తెరకెక్కిస్తారని తెలుస్తోంది. సాధారణంగా మనోజ్ సినిమాలు ఆరు నుంచి ఎనిమిది కోట్లలోపు పూర్తవుతాయి. అలాంటిది ఒక్క ఫైటు కోసమే ఆరు కోట్లు ఖర్చు పెడుతున్నాడంటే పెద్ద రిస్కే చేస్తున్నాడన్నమాట.