ఎన్టీఆర్‌ని మ‌రీ అలా పోల్చాడేంటి?

మరిన్ని వార్తలు

రాంగోపాల్ వ‌ర్మ ఎప్పుడూ వెరైటీనే. తిట్టినా పొగిడిన‌ట్టు ఉంటుంది. పొగిడినా తిట్టిన‌ట్టు వినిపిస్తుంది. ఆయ‌న కామెంట్లు మేధోమేధావుల‌కే అర్థం కావు. ఆర్జీవీ ట్వీట్లు అంత తిక‌మ‌క పెట్టేస్తుంటాయి. ఇప్పుడు ఆర్జీవీ.. ఎన్టీఆర్‌పై ప‌డ్డాడు. ఈరోజు ఎన్టీఆర్ పుట్టిన రోజు క‌దా. ఈ సంద‌ర్భంగా ఎన్టీఆర్ కండ‌లు తిరిగిన ఫొటో ఒక‌టి బ‌య‌ట‌కు వ‌చ్చింది. అది చూసి ఫ్యాన్స్ అంతా ఫిదా అయిపోయారు. ఎన్టీఆర్‌ని కొత్త లుక్‌లో చూసి.. ముచ్చ‌ట ప‌డిపోతున్నారు. ఆ ఫొటో ఇప్పుడు వైర‌ల్ గా మారింది. దానికంటే వైర‌ల్ గా ఆర్జీవీ కామెంట్ మారిపోయింది.

 

ఈ ఫొటోని త‌న ట్విట్టర్ లో షేర్ చేసిన ఆర్జీవీ.. ఎన్టీఆర్‌ని మియా మాల్కోవాతో పోల్చాడు. మియా మాల్కోవా ఓ పోర్న్ స్టార్‌. పోర్న్ స్టార్‌ని ఎన్టీఆర్ తో పోల్చ‌డం ఏమిటి? అని అభిమానులు గాభ‌రా ప‌డిపోతున్నారు. అక్క‌డితో ఆగ‌లేదు. మ‌రో అడుగు ముందుకేశాడు. నేను గేని కాన‌ని నీకు తెలుసు. కానీ ఈ ఫొటో చూశాక‌.. గేలా మారాల‌నిపిస్తుంది.. ఆ బాడీ ఎంట్రా నాయ‌నా.. అంటూ ట్వీటాడు. ఎన్టీఆర్‌పై వ‌ర్మ కామెంట్లు టాలీవుడ్ ని షేక్ చేస్తున్నాయి. ఈకామెంట్ల‌ని కొంత‌మంది స‌ర‌దాగా తీసుకుంటే.. ఇంకొంత‌మంది ఆర్జీవీపై మండి ప‌డుతున్నారు. మంచు మ‌నోజ్ అయితే.. `మా వాడ్ని వ‌దిలేయండి..` అంటూ స‌ర‌దాగా ట్వీట్ చేశాడు. ఏంటో ఈ వ‌ర్మ‌... ఉండీ ఉండీ ఇలాంటి కామెంట్లు పెడుతుంటాడు.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS