రూటు మార్చిన హెబ్బా పటేల్‌.. సక్సెస్‌ వైపు పరుగుల్‌.!

By Inkmantra - March 04, 2020 - 15:00 PM IST

మరిన్ని వార్తలు

‘కుమారి 21 ఎఫ్‌’ చిత్రంతో సుకుమార్‌ కంపెనీ నుండి దిగుమతి అయిన ముద్దుగుమ్మ హెబ్బా పటేల్‌. తొలి సినిమాకే బోల్డ్‌ ఇమేజ్‌ని టన్నుల కొద్దీ మూట కట్టుకుంది. ఆ తర్వాత నటించిన ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ సినిమాతో మంచి హిట్‌ తన ఖాతాలో వేసుకుంది. ఎంట్రీ హీరో రాజ్‌తరుణ్‌తోనే ఎక్కువ సినిమాల్లో నటించింది. తాజాగా రాజ్‌తరుణ్‌తో ‘ఒరేయ్‌ బుజ్జిగా..’ అంటూ మరోసారి జత కడుతోంది ఈ హాట్‌ హాట్‌ చిన్నది. త్వరలో ఈ సినిమా రిలీజ్‌ కానుండగా, రీసెంట్‌గా ‘భీష్మ’ సినిమాలో హాట్‌ గెస్ట్‌గా కనిపించి కుర్రోళ్ల మనసుల్ని కొల్లగొట్టేసింది. కనిపించింది రెండు, మూడు సీన్లే అయినా, ఆ కాస్సేపు తన హాట్‌నెస్‌తో పిచ్చెక్కించేసింది.

 

ఇక తాజా మూవీ ‘ఒరేయ్‌ బుజ్జిగా’లో సెకండ్‌ హీరోయిన్‌గా కనిపించనుంది. సెకండ్‌ హీరోయిన్‌ అయినా, ఏమాత్రం మొహమాటపడకుండా, రాజ్‌తరుణ్‌తో ఘాటు ఘాటుగా రొమాన్స్‌ పండిరచేయనుందని పోస్టర్స్‌ ద్వారా అర్ధమవుతోంది. ఇవన్నీ ఇలా ఉంటే, కిషోర్‌ తిరుమల దర్శకత్వంలో రామ్‌ హీరోగా తెరకెక్కుతోన్న ‘రెడ్‌’లో హెబ్బా అదిరిపోయే దెబ్బలా ఓ ఐటెం సాంగ్‌ వేసుకోనుందట. రామ్‌ డ్యాన్సుల్లో కిర్రాక్‌ పుట్టించేస్తాడని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక రామ్‌ డాన్సుకు, హెబ్బా పిచ్చెక్కించే గ్లామర్‌ యాడ్‌ అయితే, ఇంకేముంది.. స్టేజ్‌ దద్దరిల్లిపోద్ది.. ‘ఐటెం’ అద్దిరిపోద్ది.. అంతే.!


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS