‘భీష్మ’ సినిమా కోసం గెస్ట్ రోల్‌లో కనిపించిన ‘కుమారి’ భామ హెబ్బా పటేల్, తాజాగా ‘ఓదెల రైల్వే స్టేషన్’ అనే సినిమాలో నటిస్తోంది. స్టైలిష్ దర్శకుడు సంపత్ నంది ఈ చిత్రానికి కథ అందిస్తున్నాడు. అశోక్ తేజ అనే కొత్త డైరెక్టర్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం విదితమే. సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోందట. ఈ విషయాన్ని చిత్ర బృందం వెల్లడించింది. సంపత్ నంది కథ అంటే, సినిమా ఖచ్చితంగా కొత్తదనంతో కూడుకున్నదే అయి వుంటుందన్న అభిప్రాయం అందరిలోనూ నెలకొంది.
ఇక, ఈ సినిమాకి సంబంధించి ఆన్ లొకేషన్ స్టిల్స్ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. వాటిల్లో హెబ్బా పటేల్ గెటప్ అందర్నీ ఆకట్టుకుంటోంది. ‘హాట్ బాంబ్’ అనే పదానికి పెర్‌ఫెక్ట్ డెఫినిషన్ అయిన హెబ్బా పటేల్, ఈ సినిమా కోసం ట్రెడిషనల్ లుక్‌లో కనిపిస్తోంది. ఏ లుక్ అయితేనేం, హెబ్బా అనగానే గ్లామర్ అబ్బా.. అనాల్సిందే. సో, ఆమె నుంచి ఖచ్చితంగా హాట్ గ్లామర్‌ని ఆశించేయొచ్చన్నమాట. ఇదిలా వుంటే, సంపత్ నంది ప్రస్తుతం ‘సీటీమార్’ అనే సినిమాని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో గోపీచంద్ సరసన తమన్నా హీరోయిన్‌గా నటిస్తోన్న విషయం విదిమే.
ఓ పక్క డైరెక్షన్, ఇంకోపక్క ఇతర సినిమాలకు కథ అందించడం.. వెరసి ఇప్పుడున్న యంగ్ డైరెక్టర్స్ చాలా కొత్తగా రెండు పడవల మీద ప్రయాణిస్తున్నారన్నమాట. దర్శకుడు హరీష్ శంకర్ కూడా సునీల్ హీరోగా రూపొందుతున్న సినిమాకి కథ అందించడంతోపాటు, నిర్మాణంలోనూ భాగం పంచుకుంటున్న సంగతి తెలిసిందే. సుకుమార్ కూడా ఇదే బాటలో పయనిస్తున్నాడు.