మాట మార్చేసిన రామ్‌.!

మరిన్ని వార్తలు

'ట్రెండు మారినా ఫ్రెండు మారడే..' అన్నాడు రామ్‌ 'ఉన్నది ఒక్కటి జిందగీ' సినిమా లో. అయితే ఇప్పుడు మాట మార్చేశాడు. 'ఫ్రెండు ఫ్రెండు మార్చు ట్రెండు..' అంటున్నాడు. రామ్‌ నటిస్తున్న తాజా చిత్రం 'హలో గురూ ప్రేమ కోసమే' చిత్రంలోని ఓ సాంగ్‌ కోసం రామ్‌ పలికే మాటలివి. ప్రస్తుతం ఈ సాంగ్‌ చిత్రీకరణ జరుగుతోంది. చంద్రబోస్‌ సాహిత్యం అందించిన ఈ పాటకు దేవిశ్రీ ప్రసాద్‌ మ్యూజిక్‌ ఇచ్చారు. ఈ సినిమాతో ఎనర్జిటిక్‌ హీరో రామ్‌ని దేవిశ్రీ ప్రసాద్‌ సింగర్‌గా మార్చేశాడు.

 

గతంలో పలువురు హీరోల్ని సింగర్స్‌గా మార్చిన దేవిశ్రీ ప్రసాద్‌ ఈ సారి రామ్‌తో కూడా ఆ సాహసం చేయించాడు. ఈ పాట కోసం రామ్‌ తన గొంతు సవరించుకున్నాడు. ఇదో సరదా సరదా సాంగ్‌. సిట్యువేషనల్‌గా సాగుతుందట. వినడానికే కాదు, చూసేందుకు కూడా చాలా చాలా బాగుంటుందట. ప్రకాష్‌రాజ్‌ ఈ సాంగ్‌లో రామ్‌తో పాటు, గొంతు కలిపారు.

 

నక్కిన త్రినాధరావు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్‌ 18న ప్రేక్షకుల ముందుకు రానుంది. ముద్దుగుమ్మ అనుపమా పరమేశ్వరన్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. రామ్‌ - అనుపమా జంట చూడ చక్కగా ఉంది. ఇటీవల విడుదలైన రొమాంటిక్‌ స్టఫ్‌ టీజర్‌కి పోజిటివ్‌ రెస్పాన్స్‌ వచ్చింది. పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రం రామ్‌కి మంచి విజయాన్ని అందిస్తుందని చిత్ర యూనిట్‌ ఆశిస్తోంది. 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS