యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ అందాల భామ అనుపమా పరమేశ్వరన్ కాంబినేషన్‌లో నక్కిన త్రినాధరావు దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన 'హలో గురూ ప్రేమకోసమే' ఈ నెల 18న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.
తాజాగా సినిమా ట్రైలర్ విడుదలైంది. ట్రైలర్‌లో కొత్తదనం ఏమీ కనిపించలేదు. రామ్ సినిమాల్లో రెగ్యులర్‌గా కనిపించే సన్నివేశాలే ట్రైలర్‌లోనూ ఉన్నాయి. ఇలాంటి పాత్రలు రామ్‌కి కొట్టిన పిండి. రామ్ హ్యాండ్సమ్ లుక్, అనుపమా క్యూట్ లుక్ ట్రైలర్‌కి మెయిన్ హైలైట్. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఓకే.
సీనియర్ నటి సితార, పోసాని కృష్ణ మురళి, ప్రకాష్‌రాజ్ ట్రైలర్‌లో మెరిశారు. 'అబద్ధాలాడితే అమ్మాయిలు పుడతారో లేదో కానీ, అబద్దాలకు ఖచ్చితంగా అమ్మాయిలు పడతారు..' అని హీరో చెప్పే డైలాగ్ యూత్‌ని ఎట్రాక్ట్ చేస్తోంది. దిల్‌రాజు సినిమాలు చాలావరకూ క్లీన్‌గా ఉంటాయ్. ఈ సినిమాలోనూ క్లీన్‌లుక్ కనిపించింది. కొత్తదనం లేకపోయినా, ట్రైలర్ బాగానే ఎట్రాక్ట్ చేస్తోంది. దిల్ రాజు సినిమాలు తొలుత సాధారణంగా కనిపించిన మంచి విజయాన్ని అందుకుంటాయి. పండగలకి దిల్‌రాజు నుండి వచ్చే సినిమాలు ఇంకా స్పెషల్‌గా ఉంటాయి.
సో 'హలో గురూ ప్రేమ కోసమే' హీరో రామ్‌కి మంచి హిట్ ఇచ్చే అవకాశాలు ఎక్కువే. అనుపమాతో రామ్ కాంబినేషన్‌లో ఇప్పటికే 'ఉన్నది ఒక్కటే జిందగీ' సినిమా వచ్చింది.