'ఫిదా', 'మిడిల్ క్లాస్ అబ్బాయి' సినిమాలతో లక్కీ బ్యూటీ అనిపించుకున్న మలర్ బ్యూటీ సాయి పల్లవి తాజా చిత్రం 'పడి పడి లేచె మనసు' ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. డిశంబర్ 21న సినిమా రిలీజ్ కానుంది.
లేటెస్టుగా ఈ మూవీ టీజర్‌ని రిలీజ్ చేశారు. హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందిన ఈ ఇంట్రెస్టింగ్ లవ్‌స్టోరీలో ఫెస్టివల్ హీరో శర్వానంద్ హీరోగా నటిస్తున్నాడు. టీజర్ ఎలా ఉంది అని మాట్లాడుకోవడానికి ముందు హీరోయిన్ సాయి పల్లవి గురించి మాట్లాడుకోవాలి. మరోసారి ఈ బ్యూటీ తన నేచురల్ పర్‌ఫామెన్స్‌తో ఎట్రాక్ట్ చేసింది. ఒక్క మాటలో చెప్పాలంటే, హీరో శర్వానంద్‌ని డామినేట్ చేసేసింది. హీరోయిన్ బస్సులో వెళుతుంటే, బస్సు వెనకాలే హీరో బైక్‌పై ఆమెను ఫాలో చేస్తుంటాడు, కేఫ్‌లోనూ మరో చోట హీరోది అదే పని. ఓ సారి హీరోయిన్, హీరోని నిలదీసేస్తుంది.
అస్సలేమాత్రం తడుముకోకుండా హీరో కిలోమీటరు దూరం నుండి 'నేనేదో లవ్ చేసుకుంటుంటే నీకు తెలిసిపోయిందా..' అని అడుగుతాడు. శర్వా ఈజ్ సాయి పల్లవి నేచురల్ యాక్టింగ్ టీజర్‌కి హైలైట్‌గా నిలిచాయి. హను రాఘవపూడి ఈ సినిమా విషయంలో పెద్దగా రిస్క్‌ల జోలికి వెళ్లలేదనీ ఓ క్యూట్ లవ్‌స్టోరీని తెరకెక్కించాడనీ ప్రచారం జరుగుతోంది. దానికి తగ్గట్లుగానే టీజర్‌ని రూపొందించినట్లు అనిపిస్తోంది.