అనుపమ చాలా హాట్‌ గురూ.!

మరిన్ని వార్తలు

'ఉన్నది ఒకటే జిందగీ' సినిమాతో తెలుగు ప్రేక్షకుల్ని పలకరించిన రామ్‌ - అనుపమ పరమేశ్వరన్‌ జంట ఇంకోసారి వెండితెరపై హల్‌చల్‌ చేయబోతోంది 'హలో గురూ ప్రేమ కోసమే' సినిమాతో. 'ఉన్నది ఒకటే జిందగీ' ఓ మోస్తరు విజయాన్ని అందుకోగా, 'హలో గురూ ప్రేమ కోసమే' సినిమా మాత్రం బంపర్‌ విక్టరీ కొట్టబోతోందట. 

సినిమాకి ఆల్రెడీ హిట్టు కళ షురూ అయిపోయిందంటే, దానిక్కారణం తాజాగా విడుదలైన ఈ సినిమా టీజర్‌ అని చెప్పక తప్పదు. ఓ రొమాంటిక్‌ పెయిర్‌ మధ్య రొమాంటిక్‌ సంభాషణ.. ఆ సన్నివేశాన్ని ఇంకా రొమాంటిక్‌ విజువల్స్‌తో తీర్చిదిద్దిన వైనం.. ఇవన్నీ చూశాక, ఈ సినిమా గురించి నెగెటివ్‌గా మాట్లాడటం సాధ్యమా? ఛాన్సే లేదు. 

అనుపమ పరమేశ్వరన్‌ చీరకట్టులో అదిరిపోయిందంతే. రొమాంటిక్‌గా అనుపమ పరమేశ్వరన్‌ బ్యాక్‌ పార్ట్‌ కన్పిస్తుంటుంది.. ఆమెను అలా చూసి షాకవుతాడు రామ్‌. 'చూశావా..' అంటుందామె. ఇంకా షాక్‌కి గురవుతాడు రామ్‌. కానీ, అనుపమ అడిగింది కాఫీ గురించి. చూశానంటాడు రామ్‌. ఎలా వుంది? అనడుగుతుంది అనుపమ. హాట్‌గా అంటాడు రామ్‌. ఓ టైపు లుక్కు గట్టిగా ఇస్తుంది అనుపమ. అదే కాఫీ హాట్‌గా వుందని కవర్‌ చేస్తాడు రామ్‌. 

అందాల భామ కవర్‌ చేయాల్సిన పార్ట్స్‌ కనీ కన్పించకుండా కనువిందు చేస్తోంటే.. కుర్రాడికి ఏ రేంజ్‌లో కిక్‌ వస్తుందో చెప్పాల్సిన పనిలేదు కదా! సూపర్‌ రొమాంటిక్‌ సీన్‌ని, ఏమాత్రం వల్గారిటీ లేకుండా దర్శకుడు చూపించిన వైనం అదిరిపోయిందంతే.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS