అక్కినేని కాంపౌండ్ హ్యాపీనెస్‌కి అంతే లేదు. అఖిల్ సినిమా 'హలో'కి వస్తున్న టాక్‌తో. ఈ రోజు సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గ్రాండ్ రిలీజ్ అయ్యింది 'హలో'. ఉదయం నుండీ 'హలో' ధియేటర్స్ వద్ద సందడి మామూలుగా లేదు. ఆడియన్స్ టాక్ చాలా బాగుంది. అఖిల్ నటనకు అభిమానులు ఫిదా అయిపోతున్నారు.
మొత్తానికి అక్కినేని కుటుంబం పడిన కష్టం ఫలించినట్లే అనిపిస్తోంది. రివ్యూస్ చాలా పోజిటివ్‌గా వస్తున్నాయి. ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించిన కళ్యాణీ ప్రియదర్శినికి ఇది తొలి సినిమా. కానీ తొలి సినిమా అంటే ఆశ్చర్యపడేలా తన టాలెంట్ చూపించిందట. కళ్యాణీ చాలా బాగా నటించిందని మాట్లాడుకుంటున్నారు. అఖిల్ డాన్సులు, నటన, ఫైట్స్ ఇలా అన్నింట్లోనూ మంచి మార్కులేయించుకుంటున్నాడు అఖిల్. కథ పాతదే అయినా కానీ విక్రమ్ కుమార్ అటెంప్ట్‌ని మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు. టేకింగ్ సూపర్బ్‌గా ఉందంటూ ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. కొన్ని సెంటిమెంట్ సీన్లలో అఖిల్ నటన ప్రేక్షకుల్ని కట్టి పడేసేలా ఉందట.
అనూప్ రూబెన్స్ మ్యూజిక్‌తో అఖిల్ డాన్సులకు మరింత బ్రైట్‌నెస్ వచ్చిందంటున్నారు. మొత్తానికి 'హలో'తో అక్కినేని అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. అఖిల్ తొలి సినిమా నిరాశ పరచడంతో ఈ సినిమాపై భారీగా ఆశలు పెట్టుకున్నారు. ఆ ఆశలు ఫలించినట్లేననిపిస్తోంది. నటనలో అఖిల్ తొలి సినిమాతో పోలిస్తే, చాలా పరిణీతి చెందాడని టాక్. మొత్తానికి 'హలో'తో అక్కినేని బుల్లోడు రీ లాంఛింగ్ అదిరిపోయినట్లే. ఈ సినిమాని నాగార్జున తన సొంత బ్యానర్ అయిన అన్నపూర్ణా స్టూడియోస్ బ్యానర్‌లో తెరకెక్కించారు.