'హలో'
విక్రమ్ కుమార్ దర్శకత్వంలో అక్కినేని అఖిల్ రీలాంచింగ్ మూవీగా విడుదలైన 'హలో' చిత్రం ఇప్పుడు తమిళంలో విడుదల కానుంది. శ్రీలక్ష్మీ జ్యోతి క్రియేషన్స్ బ్యానర్‌లో ఈ సినిమాని తమిళంలో విడుదల చేయనున్నారు. అఖిల్ సరసన కల్యాణీ ప్రియదర్శిన్ హీరోయిన్‌గా నటించింది. అఖిల్ తల్లి అమలకు తెలుగుతో పాటు, తమిలంలోనూ హీరోయిన్‌గా మంచి గుర్తింపు ఉంది. అలాగే ఈ సినిమాలో కీలక పాత్ర పోషించిన రమ్యకృష్ణ కూడా తమిళ తంబీలకు సుపరిచితురాలు కావడంతో ఈ సినిమాని తమిళంలోకి అనువదించారు.
డిశంబర్‌లో ఈ సినిమా తమిళ ప్రేక్షకుల ముందుకు వెళ్లనుంది. మరోవైపు అఖిల్ త్వరలో 'మిస్టర్ మజ్ను' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. 'తొలిప్రేమ' డైరెక్టర్ వెంకీ అట్లూరి ఈ సినిమాకి దర్శకుడు. నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటించింది. సంక్రాంతి తర్వాత అంటే జనవరి 25న ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే యోచనలో చిత్ర యూనిట్ ఉన్నట్లు తాజా సమాచారమ్. డిశంబర్ మొదటి వారానికల్లా ఈ సినిమా టాకీ పూర్తవుతుంది.
ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకుని ప్రమోషన్స్ స్టార్ట్ చేయనున్నారట. బి.వి.యస్.ఎన్ ప్రసాద్ నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే మరో రెండు సినిమాలను అఖిల్ లైన్‌లో పెట్టాడట. ఇంతవరకూ గ్యాప్ తీసుకుని సినిమాలు చేస్తున్న అఖిల్ ఇకపై సక్సెస్, ఫెయిల్యూర్స్‌తో సంబంధం లేకుండా వరుస సినిమాల్లో నటించాలని డిసైడ్ అయ్యాడట. ఆల్రెడీ అఖిల్ కోసం రెండు కథలు సిద్ధంగా ఉన్నాయనీ, వచ్చే నెల్లోనే వాటిపై అఫీషియల్‌గా ఫైనల్ క్లారిటీ ఇచ్చేయనున్నారనీ తెలుస్తోంది.