RX100 హీరోకి పెద్ద నిర్మాత ఛాన్స్

మరిన్ని వార్తలు

RX100 సినిమాతో సక్సెస్ కొట్టిన హీరో కార్తికేయ. తన తొలి చిత్రమే పెద్ద హిట్ అవ్వడంతో కార్తికేయ కి మంచి మంచి ఆఫర్లు వస్తున్నట్టుగా సమాచారం. అయితే ఏకంగా తమిళనాడు నుండి ఒక పెద్ద నిర్మాత అదిరిపోయే సినిమా ఆఫర్ ఇచ్చినట్టుగా తెలుస్తున్నది.

ఆ వివరాల్లోకి వెళితే, తమిళ నిర్మాత అయిన కలైపులి S థాను నిర్మాతగా తెరకెక్కనున్న ఒక చిత్రంలో హీరోగా కార్తికేయని ఎంపిక చేసుకున్నట్టుగా తెలుస్తున్నది. గతంలో సూర్య నటించిన నువ్వు నేను ప్రేమ చిత్రానికి దర్శకత్వం వహించిన కృష్ణ ఈ చిత్రానికి కూడా దర్శకత్వ బాధ్యతలు నిర్వర్తించనున్నట్టుగా సమాచారం.

ఈ క్రేజీ ఆఫర్ తో కార్తికేయ సినిమా కెరీర్ దూసుకెళ్ళిపోతుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఇదే సమయంలో తెలుగు నిర్మాతల నుండి కూడా కార్తికేయకి ఆఫర్లు వస్తున్నాయట, త్వరలోనే వీటికి సంబందించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందట.

దీన్నిబట్టి కెరీర్ లో ఒక మంచి హిట్ చాలు అది ఏకంగా కెరీర్ ముఖచిత్రాన్నే మార్చేస్తుంది అని అనడానికి ఇదే నిదర్శనం.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS