ఆరడుగుల అందగాడు, ప్రముఖ దివంగత దర్శకుడు ఇవివి సత్యనారాయణ తనయుడు ఆర్యన్ రాజేష్ హీరోగా అందరికీ సుపరిచితుడే. 'సొంతం', 'ఎవడిగోల వాడిదే' తదితర చిత్రాలతో హీరోగా పాపులర్ అయ్యాడు. కానీ స్టార్‌డమ్ సంపాదించుకోలేకపోయాడు. దాంతో గత కొంత కాలంగా ఆర్యన్ రాజేష్ నటనకు దూరంగా ఉంటున్నాడు.
డిఫరెంట్ క్యారెక్టర్‌తో రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధపడ్డాడు. రామ్‌చరణ్ హీరోగా బోయపాటి శీను దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రంతో ఆర్యన్ రాజేష్ రీ ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ సినిమాలో ఆర్యన్ రాజేష్, చరణ్‌కి అన్నగా నటిస్తాడంటూ మొదట్లో ప్రచారం జరిగింది. అయితే కాదట. ఆర్యన్ రాజేష్ విలన్ అట. మెయిన్ విలన్‌గా బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ నటిస్తుండగా, సెకండ్ విలన్‌గా ఆర్యన్ రాజేష్ కనిపించనున్నాడట.
గతంలో ఆర్యన్ రాజేష్‌లాగే హీరోగా సక్సెస్ అందుకోలేక విలన్ అవతారమెత్తిన మరో యంగ్‌హీరో తారకరత్న విలన్‌గానూ సక్సెస్ కాలేకపోయాడు. నారా రోహిత్ సినిమాలో తారకరత్న విలన్‌గా నటించాడు. 'సరైనోడు' సినిమాలో ఆది పినిశెట్టి పవర్‌ఫుల్ విలన్‌గా నటించి మంచి మార్కులే వేయించుకున్నాడు. కానీ ఆ తర్వాత ఆ ఛానెల్ కొనసాగించలేకపోయాడు. 'రంగస్థలం'లో చరణ్‌కి అన్న కుమార్ బాబు పాత్రలో ప్రశంసలు అందుకున్నాడు. యంగ్ హీరోలు స్టైలిష్ విలన్లుగా బాగానే సెట్ అవుతున్నారు. కానీ నిలదొక్కుకోలేకపోతున్నారు.
మరి చరణ్ సినిమాతో విలన్‌గా ఆర్యన్ రాజేష్ ఎలాంటి సక్సెస్ అందుకుంటాడేమో చూడాలి మరి.