హీరో రాజశేఖర్ కి రోడ్డు ప్రమాదం

మరిన్ని వార్తలు

ప్రముఖ హీరో రాజశేఖర్ తృటిలో పెద్ద రోడ్డు ప్రమాదం నుండి తప్పించుకున్నారు.

వివరాల్లోకి వెళితే, ఆదివారం రాత్రి శంషాబాద్ విమానాశ్రయంలో విమానం దిగి స్వంతంగా కారు నడుపుకుంటూ బంజారాహిల్స్ లోని ఇంటికి బయలుదేరారు. కారు రాజేంద్రనగర్ పోలీసు స్టేషన్ పరిధిలోకి వచ్చాక PVN Express Way పైన ముందుగా వెళుతున్న కారుని డీకోట్టాడు. దీనితో రాజశేఖర్ కి స్వల్పంగా గాయాలయ్యాయి.

ఇక ముందున్న కారులోని వ్యక్తి పోలీసులకి ఫిర్యాదు చేయగా వెంటనే పోలీసులు అక్కడికి చేరుకొని రాజశేఖర్ ని స్టేషన్ కి తరలించారు. ఆ తరువాత బ్రీత్ అనలైజర్ పరీక్షలు నిర్వహించి రాజశేఖర్ మద్యం సేవించలేదు అన్న నిర్ధారణకు వచ్చారు.

ఈ విషయం తెలుసుకొని పొలిసు స్టేషన్ కి వచ్చిన రాజశేఖర్ భార్య ప్రాధమిక విచారణ అనంతరం ఆయన ఇంటికి తీసుకువెళ్ళారు.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS