యంగ్‌హీరో రామ్‌ ఫన్నీ పాలిటిక్స్‌.!

మరిన్ని వార్తలు

డిశంబర్‌ 7న తెలంగాణా ఎలక్షన్స్‌ సందర్భంగా జరిగిన పోలింగ్‌లో పలువురు సెలబ్రిటీలు తమ ఓటు హక్కును వినియోగించుకుని సోషల్‌ మీడియా ద్వారా తమ తమ అభిమానుల్లో ఓటు చైతన్యం పెంచే విధంగా పోస్ట్‌లు పెట్టారు. అందులో భాగంగా యంగ్‌ హీరో రామ్‌ కూడా ఓటు వేసిన అనంతరం సోషల్‌ మీడియాలో అందరిలాగే సిరా గుర్తును చూపిస్తూ ఇది నాది.. మరి మీది.? అని ట్యాగ్‌ లైన్‌ పెట్టాడు. అందుకు ఓ నెటిజన్‌ 'మేం ఆంధ్రోళ్లం'లే భయ్యా అంటూ ఫన్నీగా కామెంట్‌ పెట్టాడు.

 

అయితే అందుకు రామ్‌ ఇచ్చిన కౌంటర్‌ అందరి చేత అభినందనల వర్షం కురిపించింది. 'అది కూడా మనదే తమ్ముడూ.. ఒక్క ముఖ్యమంత్రి సరిపోలేదని ఇద్దరు చంద్రుల్ని ముఖ్యమంత్రులుగా పెట్టాం అంతే. విడదీసి ఇచ్చాం. కానీ విడిపోలేదు..' అంటూ రిప్లై ఇచ్చాడు. నిజంగా రామ్‌ సమయస్ఫూర్తిని మెచ్చుకొని తీరాల్సిందే. ప్రస్తుతం రామ్‌ కొత్త ప్రాజెక్టు విషయమై ఎలాంటి అప్‌డేట్‌ లేదు.

 

ఇటీవల 'హలో గురూ ప్రేమ కోసమే' చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రామ్‌ సరసన అనుపమా పరమేశ్వరన్‌, ప్రణీత హీరోయిన్లుగా నటించారు. కూల్‌ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రం రామ్‌కి మంచి హిట్‌ని అందిస్తుందని అంచనా వేశారు. కానీ ఆ అంచనాల్ని 'హలో గురూ..' అందుకోలేకపోయింది. చూడాలి మరి రామ్‌ తదుపరి ప్రాజెక్ట్‌తో ఏమయినా బౌన్య్‌ బ్యాక్‌ అవుతాడేమో.!


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS