స్నేహం మీద ఇప్పటివరకూ చాలా సినిమాలే వచ్చాయి. ఎన్ని సార్లు వచ్చినా, స్నేహం మీద సినిమాలు ప్రేక్షకులకు అస్సలు బోర్ కొట్టవు. స్నేహం, ప్రేమ అనే ఈ రెండు బంధాలకు ఉన్న గొప్పతనం అలాంటిది. ఎన్ని సినిమాలు తెరకెక్కినా, ఇంకా ఇంకా కొత్త కొత్తగా పుట్టుకొస్తూనే ఉంటాయి. ఇంతవరకూ సినిమాగా తెరకెక్కని పాయింట్‌తో తెరకెక్కుతోన్న చిత్రం 'ఉన్నది ఒక్కటే జిందగీ'. రామ్ హీరోగా నటిస్తున్నాడు. స్నేహం ఒక్కటే కాదు, ప్రేమకీ ఇంపార్టెన్స్ ఉంది ఈ సినిమాలో. యూత్ మెచ్చే సినిమా అవుతుందంటున్నాడు రామ్. అలాగే ఫ్యామిలీ ఆడియన్స్‌ని టచ్ చేసే బంధాలు, అనుబంధాలు ఈ సినిమా ద్వారా చూపించబోతున్నారట. చాలా అరుదుగా ఇలాంటి చిత్రాలు తెరకెక్కుతూ ఉంటాయి. ఆ అదృష్టం ఈ సారి నాకు వచ్చిందంటున్నాడు యంగ్ హీరో రామ్. అలాగే ఇంతవరకూ తన కెరీర్‌లో టచ్ చేయని కాన్సెప్ట్ అట 'ఉన్నది ఒక్కటే జిందగీ'. ఫ్రెండ్‌షిప్‌కీ, ప్రేమకీ రెండింటికీ ఇంపార్టెన్స్ ఈక్వెల్‌గా ఉండబోతోందీ సినిమాలో. సినిమా చేసేటప్పుడు చాలా ఎమోషనల్‌గా ఫీలయ్యాడట రామ్. ఆ పెయిన్ ఆడియన్స్‌కీ కనెక్ట్ అవుతుందంటున్నాడు. హీరోయిన్స్‌గా నటించిన అనుపమా పరమేశ్వరన్, లావణ్య త్రిపాఠి క్యారెక్టర్స్‌కీ ఎక్కువ వెయిట్ ఉండబోతోంది. శ్రీ విష్ణు పాత్ర రామ్‌కి ఫ్రెండ్‌గా చాలా నేచురల్‌గా ఉంటుంది. కాన్సెప్ట్‌కి తగ్గట్లుగా హార్ట్ టచ్చింగ్ మ్యూజిక్‌ని అందించాడు మ్యూజిక్ మాంత్రికుడు దేవిశ్రీ ప్రసాద్. కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకు రానుంది