ఎప్పుడూ లేనిది కథానాయకుడు రామ్ .. ఓ పొలిటికల్ ట్వీట్ వేశారు. అదీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ పై. దాంతో.. ఇప్పుడు ఇదో హాట్ టాపిక్ గా మారింది. ,”హోటల్ స్వర్ణ ప్యాలస్ ని రమేష్ హాస్పిటల్స్ వాళ్లు కోవిడ్ సెంటర్ గా మార్చక ముందు , ప్రభుత్వం అక్కడ క్వారంటైన్ సెంటర్ నిర్వహించింది. అప్పుడీ అగ్ని ప్రమాదం జరిగి ఉంటే ఎవరిని నిందించే వాళ్లు ? ఫైర్ + ఫీజు = ఫూల్స్ అందరినీ ఫూల్స్ చేయడానికే విషయాన్ని ఫైర్ నుంచి ఫీజు వైపు మళ్లిస్తున్నారా? ఫీజుల వివరణ: మేనేజ్‌మెంట్ బాధ్యతలను నిర్వహిస్తున్న స్వర్ణప్యాలెస్ డైరెక్ట్ గా బిల్లింగ్ చేసింది.
పెద్ద కుట్ర జరుగుతున్నట్టుంది!! సీఎంని తప్పుగా చూపించడానికి! @ysjagan garu మీ కింద పనిచేసే కొంతమంది మీకు తెలియకుండా చేసే కొన్ని పనుల వల్ల మీ రెప్యుటేషన్ కీ, మీ మీద మేం పెట్టుకున్న నమ్మకానికి డ్యామేజ్ కలుగుతోంది. వాళ్ల మీద ఓ లుక్కేస్తారని ఆశిస్తున్నాం” అని ట్విట్టర్ లో రాసుకొచ్చారు రామ్. రమేష్ హాస్పటల్ విషయంపై కొన్ని రోజులుగా వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే.
ఈ విషయంలో రమేష్ హాస్పటల్ యాజమాన్యం వైపు వకాల్తా పుచ్చుకుని రామ్ ట్వీట్ చేసినట్టు అనిపిస్తోంది. రమేష్ ఆసుపత్రి యాజమాని రామ్ కి దగ్గర బంధువులు అని సమాచారం. దాంతో.. ఈ ట్వీట్ కాస్త వివాదాస్పదం అవుతోంది. బంధువుల్ని కాపాడడానికి చేస్తున్న ప్రయత్నమా? అంటూ... నెటిజన్లు రామ్ ని ప్రశ్నిస్తున్నారు. మరికొంతమంది `ధైర్యంగా ట్వీట్ చేశావ్` అంటూ రామ్ ని అభినందిస్తున్నారు.
పెద్ద కుట్ర జరుగుతున్నట్టుంది!! సీఎంని తప్పుగా చూపించడానికి! @ysjagan garu.మీ కింద పనిచేసే కొంతమంది మీకు తెలియకుండా చేసే కొన్ని పనుల వల్ల మీ రెప్యుటేషన్ కీ,మీ మీద మేం పెట్టుకున్న నమ్మకానికి డ్యామేజ్ కలుగుతోంది.వాళ్ల మీద ఓ లుక్కేస్తారని ఆశిస్తున్నాం🙏#APisWatching
— RAm POthineni (@ramsayz) August 15, 2020