రాజశేఖర్ నెక్స్ట్ సినిమా రీమేక్ అంటున్నారే!

By Inkmantra - August 15, 2020 - 13:00 PM IST

మరిన్ని వార్తలు

యాంగ్రీ స్టార్ రాజశేఖర్ కొంత కాలం క్రితం 'కల్కి' అనే చిత్రంతో ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేశారు. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఆ సినిమాకు మంచి పేరు వచ్చింది కానీ బాక్సాఫీసు దగ్గర విజయం మాత్రం లభించలేదు. ఇప్పుడు కొంత కాలం గ్యాప్ తర్వాత రాజశేఖర్ మరో చిత్రానికి పచ్చజెండా ఊపారు. ఈ సినిమాకు అవార్డు విన్నింగ్ దర్శకుడు నీలకంఠ దర్శకత్వం వహిస్తారు.

 

ఇదిలా ఉంటే ఈ సినిమా గురించి తాజాగా ఒక ఆసక్తికరమైన సమాచారం బయటకు వచ్చింది. ఈ సినిమా 2018 లో రిలీజ్ అయిన 'జోసెఫ్' అనే మలయాళం హిట్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కుతోందని అంటున్నారు. క్రైమ్ థ్రిల్లర్ జానర్లో తెరకెక్కిన ఈ సినిమాకు పద్మ కుమార్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో జోజు జార్జ్, దిలీష్ పోతన్, ఆత్మీయ రాజన్, మాధురి బ్రగంజా కీలక పాత్రల్లో నటించారు.

 

ఈ సినిమా కథకు తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా స్వల్ప మార్పులు చేర్పులు చేస్తున్నారని సమాచారం. ఈ సినిమాను రాజశేఖర్ కుమార్తెలు శివానీ, శివాత్మిక మరో నిర్మాత MLV సత్యనారాయణతో కలిసి నిర్మిస్తున్నారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS