తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ అయిన హీరో తరుణ్ త్వరలోనే పెళ్ళి పీటలెక్కబోతున్నాడు.
వివరాల్లోకి వెళితే, తరుణ్ తన తల్లికి ఈ సంవత్సరం పెళ్ళి చేసుకుంటాను అని చెప్పడంతో త్వరలోనే తరుణ్ ఒక ఇంటివాడు కాబోతున్నట్టు క్లారిటీ వచ్చేసింది. దీనితో ఎప్పుడా ఎప్పుడా అని అనుకుంటున్న తరుణ్ పెళ్ళికి సమయం వచ్చేసింది.
ఇక తరుణ్ సినిమా కెరీర్ పరంగా చూసుకుంటే- ఇది నా లవ్ స్టొరీ అంటూ ఈ ఏడాది ప్రేమికుల రోజు అయిన ఫిబ్రవరి 14వ తేదీన ప్రేక్షకుల ముందుకి రానున్నాడు. ఒకప్పుడు కెరీర్ లో పీక్ చూసిన ఈ హీరో గత కొన్నేళ్ళుగా పూర్తిగా వెనకపడిపోయాడు ఆ తరువాత బిజినెస్ మెన్ గా మారి వ్యాపార రంగంలోకి దిగాడు.
త్వరలోనే ఓ ఇంటివాడు కావాలనుకుంటున్న హీరో తరుణ్ కి మంచి భాగస్వామి దొరకాలి అని కోరుకుంటూ ఆయనకి మా iQlikMovies తరపున ‘బెస్ట్ విషెస్’.