భాషల మధ్య దూరం తగ్గించేస్తున్నాడీ కన్నడ హీరో.!

మరిన్ని వార్తలు

భాషల మధ్య దూరం ఎప్పుడో తగ్గిపోయింది. పరభాషా సినిమాలు మన భాషలోకి అనువాదమై మంచి ఫలితాలు అందుకుంటున్నాయి. అలాగే ఇతర భాషా సినిమాలు తెలుగులో కూడా సక్సెస్‌ అవుతున్నాయి. తాజాగా కన్నడ హీరో యష్‌ నటిస్తున్న చిత్రం 'కేజీఎఫ్‌' గురించి మాట్లాడుకోవాలి. కన్నడతో పాటు, తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో ఏకకాలంలో ఈ సినిమాని విడుదలవుతుండడం ఈ సినిమా ప్రత్యేకత. ముఖ్యంగా 'కేజీఎఫ్‌' హీరో యష్‌కి ఎక్కడికెళ్లినా విపరీతమైన ఆదరణ దక్కుతోంది. 

 

యష్‌ కూడా తెలివైనవాడే. ఎక్కడికక్కడే తన ఉనికిని చాటుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. మొన్న తెలుగులో ఈ సినిమా ప్రమోషన్స్‌ నిమిత్తం నిర్వహించిన ఈవెంట్‌కి దర్శక ధీరుడు రాజమౌళిని ఆహ్వానించి 'బాహుబలి' స్థాయి మార్కుల్నీ, అభిమానాన్ని కొట్టేశాడు. ఇప్పుడు తమిళంలో ప్రెస్‌ మీట్‌ నిర్వహించి తమిళ అగ్రహీరోల్లో ఒకరైన విశాల్‌ ఫాలోవర్స్‌ మనసుల్ని కొల్లగొట్టేశాడు. తమిళంలో విశాల్‌ ఫిలిం ఫ్యాక్టరీ బ్యానర్‌ ద్వారా ఈ సినిమా విడుదలవుతోంది. నెక్ట్స్‌ మనోడి దృష్టి బాలీవుడ్‌ పైనే కావచ్చు.

 

అక్కడ ఆల్రెడీ 'కేజీఎఫ్‌' ట్రైలర్‌కి రావల్సిన హైప్‌ రానే వచ్చింది. అక్కడి ప్రేక్షకులు ఈ ట్రైలెర్ని ఆకాశానికెత్తేశారు. ఇక విడుదలయ్యాక సినిమా ఎన్ని సంచలనాలు సృష్టిస్తుందో. బంగారు గనులు, స్మగ్లింగ్‌ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా కథ చాలా ఆశక్తికరంగా అనిపిస్తోంది. ఏకంగా బాహుబలి సినిమాతో ఈ సినిమాని పోల్చుతుండడం విశేషం. చూడాలి మరి విడుదలయ్యాక ఈ సినిమా ఆ రేంజ్‌లో అంచనాల్ని అందుకుంటుందో లేదో. ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS