వావ్‌.! రష్మికా ఎంత రిస్క్‌ చేశావ్‌.!

మరిన్ని వార్తలు

హీరోయిన్‌ రష్మికా మండన్నా చాలా పెద్ద రిస్క్‌ చేసేసింది. సహజంగా హీరోయిన్లు రిస్క్‌ చేయడం అంటే ఏదో ఛాలెంజింగ్‌ రోల్స్‌ని ఎంచుకోవడమనే అనుకుంటాం. కానీ కన్నడ బ్యూటీ రష్మికా చేసిన రిస్క్‌ గురించి తెలిస్తే, ఆమెని ప్రశంసించకుండా ఉండలేరు. వివరాల్లోకి వెళితే, కర్ణాటకలో అతి పెద్ద చెరువైన బెళ్లందూర్‌ చెరువులో రష్మికా ఫోటో షూట్‌ చేయించుకుంది. ఇదేదో సోషల్‌ మీడియాలో తన అందాలను ఆరబోసి తద్వారా ఫాలోవర్స్‌ని పెంచుకునేందుకు చేసిన ఫోటో షూట్‌ అస్సలు కాదు. నీటి కాలుష్యంపై అవగాహన పెంచేందుకు తన వంతు ప్రయత్నంగా రష్మికా మండన్నా ఈ సాహసం చేసింది. 

 

చెరువు నీటి లోతులో ఆమె దిగిన ఫోటో సంచలనమైంది. ఆమె చుట్టూ ప్లాస్టిక్‌ కవర్లు చిందరవందరగా ఎగురుతూ కనిపిస్తున్నాయి. నీటి కాలుష్యంపై అవగాహన పెంచేందుకు అద్భుతమైన టీమ్‌తో కలిసి ఈ ఫోటో షూట్‌ చేశాను. ఒకప్పుడు ఎలా ఉండే చెరువు ఇప్పుడు ఇలా అయిపోయింది. ఈ చెరువును ఇలా చూసి గుండె పగిలినంత పనైంది. అందుకే ఇంత రిస్క్‌ చేశాను.. అని రష్మికా చెప్పుకొచ్చింది. ఒక్క బెళ్లందూర్‌ చెరువే కాదు, చాలా చోట్ల చెరువుల పరస్థితి ఇలాగే ఉంది. 

 

ఎంత అవగాహన పెంచినా జనాల్లో చైతన్యం రావట్లేదు. పరిస్థితిలో మార్పు వచ్చినా రాకపోయినా రష్మికాకి వచ్చిన ఈ ఆలోచన అయితే నిజంగా మెచ్చుకోదగ్గదే. మరోవైపు ముద్దుగుమ్మ ఆదాశర్మ స్మోకింగ్‌ చేయొద్దని స్మోక్‌ చేస్తే ఏమవుతుందో చూడండని ఓ వీడియో క్లిప్పింగ్‌ ద్వారా పర్‌ఫామ్‌ చేసి చూపించింది. హీరోయిన్లంటే కేవలం అందాలారబోతకే కాదు, అప్పుడప్పుడూ సమాజ హితం కోసం ఇలాంటి రిస్క్‌లు కూడా చేస్తారని ఆదా, రష్మికాలు ప్రూవ్‌ చేశారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS