గ్లామర్ అంటేనే ఆకర్షణ. ఆ ఆకర్షణ ఉంటేనే హీరోయిన్స్‌కి కెరీర్ ఉండేది. అందుకే ఎట్రాక్షన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటోంది పదహారణాల తెలుగు ముద్దుగుమ్మ ఈషా. ఇటీవలే 'అమీ తుమీ' సినిమాలో నటించింది ఈ భామ. ఇంద్రగంటి మోహన్కృష్ణకి తెలుగమ్మాయిలంటే చాలా ఇష్టం. తన సినిమాల్లో ఖచ్చితంగా తెలుగు భామలకి చోటుంటుంది. అలా పాపులర్ అయిన భామే ఈషా. ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు టాలీవుడ్ హాట్ టాపిక్ అయ్యింది. సోషల్ మీడియాలో హాట్ హాట్ పిక్స్ పెడుతూ ఆడియన్స్‌ని బాగా ఎట్రాక్ట్ చేస్తోంది. అమ్మడికి తెలివితేటలు కొంచెం ఎక్కువే. గ్లామర్ అంటే ఎట్రాక్షన్ అంటూ ఫిలాసఫీ చెబుతూనే మెల్లగా తన పని తాను చేసుకుని పోతోంది. అంటే ఆ రకంగా ఇండస్ట్రీని ఆకర్షిస్తోందన్న మాట ఈ బ్యూటీ. ఏదేమైతేనేముందిలెండి మొత్తానికి తెలుగులో మన తెలుగు ముద్దుగుమ్మలకి ఆదరణ తక్కువే. అలాంటి టైంలో ఈషాకి ఇంత మంచి ఆదరణ దక్కుతుంటే సంతోషించదగ్గ విషయమే. 'అమీ తుమీ'లో తెలంగాణా యాసలో మాట్లాడుతూ తన డైలాగులతో యూత్‌ని బాగా ఎట్రాక్ట్ చేసింది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం 'మాయామాల్' అనే హారర్ కామెడీ సినిమాలో నటిస్తోంది. ఇది కాక 'దర్శకుడు' సినిమాలోనూ ఈషానే హీరోయిన్. తన ఫ్చూచన్ ప్లానింగ్స్ ఏంటని ఈ ముద్దుగుమ్మని అడిగితే, తెలుగులో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకోవాలన్నదే తన లక్ష్యమంటోంది ముద్దుగుమ్మ ఈషా.