తొలి తెలుగు సినిమా 'దేశముదురు'లో చబ్బీ చబ్బీగా లేలేత అందాలు ఆరబోసేసిన హన్సిక, ఇప్పుడు బాగా బొద్దుగుమ్మలా తయారైందనుకోండి. అది వేరే సంగతి. ఒకప్పుడు తెలుగు సినిమా పరిశ్రమలోనే సెటిలైపోతానని చెప్పిందిగానీ, ఇప్పుడు పూర్తిగా తమిళ సినిమాలకే ఫిక్సయిపోయింది. అడపా దడపా తెలుగు సినిమాల్లో కన్పిస్తోన్న ఈ అందాల భామ అప్పుడే 50 సినిమాల్ని పూర్తి చేసేసుకుంటోంది. ఆమె 50వ చిత్రం పేరు 'మహ'.
జమీల్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ తమిళ సినిమా తెలుగులో కూడా విడుదలవుతుందట. దొంగ బాబాల్లానే, దొంగ మాతాజీల పేరుతో జనాన్ని మోసం చేసే కిలేడీస్ కూడా కన్పిస్తుంటారు. అలాంటి 'కిలేడీ' పాత్రలో కన్పించబోతోందట హన్సిక 'మహ' సినిమాలో. అంతే కాదండోయ్, ఈ సినిమాలో హన్సిక చాలా గెటప్స్ వేస్తోంది. తన కెరీర్‌లో ఒకే సినిమాలో ఇన్ని గెటప్స్ వేయడం ఇదే తొలిసారి అని అంటోంది హన్సిక.
నటిగా తనకు ఈ సినిమా ఓ ఛాలెంజింగ్ అని చెబుతోన్న హన్సిక, తన 50వ సినిమా ఇంత ఛాలెంజింగ్‌గా వుండడం తనకు చాలా ఆనందాన్నిస్తోందని అంటోంది. తెలుగు సినిమాలకి మొహం చాటెయ్యలేదనీ, అవకాశాలు వస్తూనే వున్నాయనీ, అడపా దడపా తెలుగులోనూ నటిస్తున్నానని చెబుతోంది హన్సిక. సౌత్‌లో బిజీగా వుండడం వల్లే బాలీవుడ్‌ని పక్కన పెట్టిందట ఈ అందాల భామ. బాలీవుడ్‌లో హన్సిక బాల నటిగానూ నటించిన సంగతి తెల్సిందే.