పవన్ కల్యాణ్‌పై విరుచుకుపడడానికి ప్రత్యర్థులకు దొరికిన బలమైన ఆయుధం.. మూడు పెళ్లిళ్లు. జగన్ సైతం...పవన్‌ని `నిత్య పెళ్లికొడుకు` అని అభివర్ణిస్తూ.. విమర్శనా బాణాలు సంధిస్తున్నాడంటే... ఈ మేటర్ - ఎంత బలంగా మారిందో అర్థం అవుతుంది. పవన్ సైతం `గత్యంతరం లేక మూడు పెళ్లిళ్లు చేసుకోవాల్సివచ్చింది` అంటూ బహిరంగ సభలలోనే అంటున్నాడు. అయితే.. ఈ పెళ్లిళ్ల గురించి.. తొలిసారిగా నాగబాబు స్పందించాడు.
తన తమ్ముడిని నేరుగా ఎదుర్కోలేక, ఇలా వ్యక్తిగత అంశాల్లోకి వెళ్తున్నారని, మూడు పెళ్లిళ్లు మూడు పెళ్లిళ్లు.. అంటూ ఎంతకాలం ఒకే పాయింట్‌తో విమర్శిస్తారని..?? విమర్శించడానికి కొత్త పాయింట్లు వెదుక్కోమని ప్రత్యర్థులకు సలహా ఇచ్చాడు నాగబాబు. మీడియా మొత్తం..
తన తమ్ముడికి వ్యతిరేకంగా మారిపోయినా - సోషల్ మీడియా వల్ల నిలదొక్కుకోగలిగాడని, తమ కుటుంబ సహాయ సహకారాలు పవన్ కల్యాణ్‌కి ఎప్పుడూ ఉంటాయని, అయితే తనకు పదవీ వ్యామోహం లేదని, ప్రత్యక్షరాజకీయాలకు దూరంగా ఉండాలనుకుంటున్నానని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు మెగా బ్రదర్.