క్యూటీ ఇంత నాటీగా మారిపోయిందే.!

By iQlikMovies - December 11, 2018 - 12:12 PM IST

మరిన్ని వార్తలు

అల్లు అర్జున్‌ నటించిన 'దేశముదురు' చిత్రంలో క్యూట్‌ అండ్‌ హాట్‌గా ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ హన్సిక. తెలుగులో పలు విజయవంతమైన చిత్రాల్లో నటించింది. కానీ ఈ హాట్‌బ్యూటీకి తమిళంలోనే స్టార్‌డమ్‌ దక్కింది. తెలియలేదు కానీ, హన్సికకు 50 చిత్రాల్లో నటించిన అనుభవం దక్కేసింది. ఇంతవరకూ గ్లామర్‌ పాత్రల్లోనే కనిపించి కుర్రోళ్ల మనసుల్ని సన్నగా కోసేసిన ఈ క్యూట్‌ బ్యూటీ ఇప్పుడు ఎంత నాటీగా మారిపోయిందో చూశారా.? హన్సిక తాజా చిత్రం 'మహా'.

 

ఇదో విభిన్న కథాంశంతో తెరకెక్కుతోన్న చిత్రం. మహారాణి పాత్రలో హన్సిక కనిపించబోతోందట. అయితే లేటెస్టుగా ఈ సినిమా నుండి విడుదలైన ఫస్ట్‌లుక్‌ ఇంట్రెస్ట్‌ క్రియేట్‌ చేస్తోంది. సింహాసనంపై యోగి వస్త్రాలు ధరించిన హన్సిక గుప్పుగుప్పుమంటూ దమ్ము లాగేస్తూ మాస్‌ లుక్‌లో కనిపిస్తోంది. మహారాణి అంటున్నారేంటీ.? ఈ లుక్‌ ఏంటీ.? అని అందరూ అవాక్కవుతున్నారు. కానీ ఈ తరహా లుక్‌లో హన్సికను చూసిన అభిమానులు అవాక్కవుతున్నారు.

 

అయినా కానీ గుడ్‌ రెస్పాన్సే ఇచ్చేస్తున్నారు. యూ ఆర్‌ జమీల్‌ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఎక్స్‌ట్రా ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌ నిర్మిస్తోంది. కాగా ఇంతవరకూ హన్సిక పోషించని కొత్త పాత్ర ఇది. ఈ పాత్రలోని వేరియేషన్స్‌ చాలా సవాళ్లతో కూడుకొన్నవిగా హన్సిక చెబుతోంది. కథనంలో కొత్తదనంతో పాటు, కమర్షియల్‌ అంశాలు కూడా ఈ సినిమాలో పుష్కలంగా ఉండబోతున్నాయట. త్వరలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS