అక్కినేని అఖిల్ తాజా చిత్రానికి హీరోయిన్ కోసం వేట గట్టిగా కొనసాగుతోంది. హీరోయిన్ లేకుండానే షూటింగ్ జరుపుకుంటోంది ఈ సినిమా. హైద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో అఖిల్ సహా ఇతర కీలక పాత్రధారులపై కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోందట. 'బొమ్మరిల్లు' భాస్కర్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇక హీరోయిన్ కోసం క్రేజీ స్టార్డమ్ ఉన్న ముద్దుగుమ్మల్ని పరిశీలించారు. కానీ ఆ లిస్టులో ఉన్న అందాల భామలు తమ తమ బిజీ షెడ్యూల్స్ కారణంగా, అఖిల్‌కి ప్రస్తుతం డేట్స్ ఇచ్చేందుకు సిద్ధంగా లేకపోవడంతో ఈ సినిమాకి ఇంకా హీరోయిన్ కన్ఫామ్ కాలేదు.
అయితే, తాజాగా అందుతోన్న సమాచారం ప్రకారం అఖిల్‌కి హీరోయిన్ విషయంలో త్వరలోనే సస్పెన్స్ వీడనుందనే టాక్ తాజాగా తెరపైకి వచ్చింది. అంటే ఆమె దొరికేసినట్లేనా.?ఏమో తెలీదు కానీ, ఆమె ఎవరు.? అనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్సే. త్వరలోనే ఆమె పేరుతో పాటు, ఫస్ట్‌లుక్ కూడా రివీల్ చేయనున్నారట. అందుకోసం ఫోటో సెషన్స్ జరుగుతున్నాయనీ తెలుస్తోంది. హీరోతో పాటు, హీరోయిన్ కలిసి ఉన్న ఫోటోని రిలీజ్ చేయాలనుకుంటున్నారట. సో అతి త్వరలోనే అఖిల్‌తో రొమాన్స్ చేయబోయే హీరోయిన్ తెలిసిపోనుంది. అందుకు శరవేగంగా ఏర్పాట్లు చేస్తున్నారట. అయితే అఖిల్ కోసం లోకల్ బ్యూటీనే ఎంచుకున్నారా.? లేక నార్త్ నుండి దిగుమతి చేశారా.? లేక కొత్త భామని దించారా.? ఈ ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే, ఇంకెంతో సమయం వేచి చూడక్కర్లేదేమో బహుశా.