బాక్సాఫీసు దగ్గర పూరి మరోసారి తన స్టామినా చూపించాడు. తన క్రేజ్, పెన్నులో పదును ఇంకా తగ్గలేదని నిరూపించాడు.. ఇస్మార్ట్ శంకర్‌తో. రామ్ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రం గురువారం విడుదలైంది. తొలి షో నుంచే.. హిట్ టాక్ దక్కించుకున్న సినిమా బాక్సాఫీసు దగ్గర తన ప్రభావం చూపిస్తోంది. తొలి మూడు రోజులకూ దాదాపు 17 కోట్ల షేర్ తెచ్చుకుంది. గ్రాస్ పరంగా చూస్తే 30 కోట్లు దాటేసింది.
రామ్ సినిమాల్లో ఇదే రికార్డు. తొలి మూడు రోజులకే పంపిణీదారులు బ్రేక్ ఈవెన్‌లో పడిపోయారు. ఇక నుంచి వచ్చే ప్రతీ రూపాయీ లాభమే అనుకోవాలి. నైజాంలో ఈసినిమాకి 7 కోట్ల వరకూ వసూళ్లు అభించాయి. నైజాంలో ఈ సినిమా రూ.6.75 కోట్లకుఅమ్ముడుపోయింది. ఆ లెక్కన పెట్టుబడి మూడు రోజులకే తిరిగొచ్చేసినట్టు. సీడెడ్‌లో 2.5 కోట్లకుకొంటే, సరిగ్గా మూడు రోజులకు అంతే వసూళ్లు తెచ్చుకుంది.
ఉత్తరాంధ్ర ఇప్పటికే లాభాల బాట పట్టింది. అక్కడ ఈ సినిమాకి 1.5 కోట్లకు కొన్నారు. ప్రస్తుతం 1.70 కోట్లు తెచ్చుకుంది. గుంటూరు, వెస్ట్, ఈస్ట్, కృష్ణ ఏరియాల్లో దాదాపుగా పెట్టుబడి తిరిగొచ్చేసింది. పూరి సినిమాకు ఈస్థాయి వసూళ్లు దక్కడం చాలా కాలం తరవాత ఇదే తొలిసారి. ఆదివారం కూడా ఇదే జోరు చూపిస్తే.. ఇస్మార్ట్ హిట్ నుంచి సూపర్ హిట్ వైపు దూసుకెళ్లొచ్చు.