నో... దయచేసి ఆ తప్పుడు ఆ వార్త‌ల్ని న‌మ్మొద్దు

By iQlikMovies - November 28, 2018 - 10:28 AM IST

మరిన్ని వార్తలు

ఈమ‌ధ్య త్రిష పేరు వార్త‌ల్లో బాగా వినిపిస్తోంది. `96`తో ఓ సూప‌ర్ హిట్ కొట్టింది క‌దా.. దాంతో త్రిష మ‌రోసారి టాక్ ఆఫ్ ది టౌన్ అయిపోయింది. ఆమె పెళ్లికి సంబంధించిన రూమ‌ర్లు కూడా గ‌ట్టిగా చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. చెన్నైకి చెందిన ఓ వ్యాపార వేత్త‌తో త్రిష పెళ్లి కుదిరింద‌ని, త్వ‌ర‌లో వీళ్లిద్ద‌రూ ఒక్క‌టి కాబోతున్నార‌ని వార్త‌లొస్తున్నాయి. ఇది వ‌ర‌కు త్రిష‌కు ఓ నిర్మాత‌తో పెళ్లి కుదిరింది. నిశ్చితార్థం కూడా అయిపోయాక‌.. ఇద్ద‌రూ బ్రేక‌ప్ చెప్పేసుకుని విడిపోయారు.

 

ఆ త‌ర‌వాత త్రిష పెళ్లి ప్ర‌స్తావ‌న తీసుకురాలేదు. ఇప్పుడు మ‌ళ్లీ త్రిష పెళ్లి త‌మిళ‌నాట టాక్ ఆఫ్‌ది టౌన్ అయ్యింది. ఈసారి త్రిష గ‌ప్ చుప్‌గా నిశ్చితార్థం చేసేసుకుని, పెళ్లి వార్త‌తో స‌ర్‌ప్రైజ్ ఇస్తుంద‌ని చెప్పుకున్నారు. అయితే.. ఇది కేవ‌లం గాలి వార్తేన‌ని కొట్టిపారేసింది త్రిష‌.  అయితే పెళ్లి గురించి త‌న‌కు విముఖ‌త ఏమీ లేద‌ని, న‌చ్చిన వ్య‌క్తి దొరికితే త‌ప్ప‌కుండా చేసుకుంటాన‌ని,  ఆవిష‌యాన్ని త‌న అభిమానుల‌కు త‌ప్ప‌కుండా చెబుతాన‌ని హామీ ఇచ్చింది త్రిష‌.

 

న‌య‌న‌తార‌- త్రిష మ‌ధ్య విబేధాలు న‌డుస్తున్నాయ‌ని, వీరిద్ద‌రికీ అస్స‌లు ప‌డ‌డం లేద‌ని ఇండ్ర‌స్ట్రీలో మ‌రో టాక్‌. ఈ  గాసిప్ త్రిష వ‌ర‌కూ వెళ్లింది. ఈ వార్త‌ల్నీ త్రిష గ‌ట్టిగానే ఖండించింది.  క‌థానాయిక‌ల మ‌ధ్య పోటీ అనేది ఉండ‌ద‌ని, ఎవ‌రి అవ‌కాశాలు వాళ్ల‌కి వ‌స్తుంటాయ‌ని, ఎవ‌రికి త‌గిన క‌థ‌లు వాళ్ల‌ని వెదుక్కుంటూ వ‌స్తాయ‌ని తేల్చి చెప్పింది. న‌య‌న‌తో ఎలాంటి గొడ‌వ‌లూ లేవు అని క్లారిటీ ఇచ్చేసింది. మొత్తానికి త్రిష గురించి వ‌చ్చిన రెండు వార్త‌లూ.. గాలి వార్త‌లే అని తేలిపోయాయి. త్రిష ఫ్యాన్స్ ఇక రిలాక్స్ అయిపోవొచ్చు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS