'అ' సినిమాలో నలుగురు అందాల భామలున్నారు. స్టార్‌డమ్ ప్రకారం చూస్తే మిగతా ముగ్గురిలోకీ కాజల్‌ని ఫస్ట్ ప్లేస్‌లో ఉంచాలి. బెస్ట్ పర్‌ఫార్మర్ అంటే నిత్యా మీనన్. రెజీనా గ్లామరస్ బ్యూటీ. ఇషా రెబ్బ ఇప్పటిదాకా చిన్న సినిమాల్లోనే కనిపించింది. మరి వీరిలో 'అ' దర్శకుడు ఎవరికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చినట్లు..? ఈ ప్రశ్న ప్రేక్షకుల్లో ఉత్కంఠ రేపుతోంది.
టీజర్‌ని చూస్తే, అందరికీ తగిన ఇంపార్టెన్స్ ఇచ్చినట్లే ఉంది. కొంచెం ఎక్కువ స్కోప్ కాజల్‌కే దక్కింది. అయితే గెటప్ పరంగా రెజీనాకి ఎక్కువ మార్కులు పడుతున్నాయి. ఆమెది నెగిటివ్ రోల్ అనుకోవచ్చు. సాధారణంగా ఇంతమంది ముఖ్య తారాగణం ఉన్నప్పుడు దర్శకుడికి డీల్ చేయడం చాలా కష్టం. అయితే దర్శకుడు ప్రశాంత్ వర్మ ఆయా పాత్రల్ని చాలా బాగా రాసుకున్నాడట. తెరపై ఒక్కో పాత్ర మైండ్ బ్లోయింగ్ అనేలా ఉంటాయట. టీజర్ వచ్చిన తర్వాత ఈ సినిమాని ఎవ్వరూ అభినందించకుండా ఉండలేకపోతున్నారు.
తాజాగా జక్కన్న రాజమౌళి ప్రశంసలు కూడా దక్కాయి ఈ సినిమాకి. బిజినెస్ పరంగా కూడా సినిమాకి పోజిటివ్ ఎట్మాస్పియర్ కనిపిస్తోంది. శ్రీనివాస్ అవసరాల, మురళీ శర్మ, ప్రియదర్శన్, వీరితో పాటు నలుగురు అందాల భామలు ఇతరత్రా తారాగణం వీటికి తోడు కావాల్సినంత కొత్తదనం, 'అ' సినిమాకి విడుదలకు ముందే విపరీతమైన క్రేజ్ తెచ్చిపెడుతున్నాయి. చేపగా నాని, చెట్టుగా రవితేజ ఈ సినిమాకి ఎక్స్‌ట్రా బోనస్. ఫిబ్రవరిలో ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.