హిడింబ మూవీ రివ్యూ & రేటింగ్

మరిన్ని వార్తలు

చిత్రం: హిడింబ
నటీనటులు: అశ్విన్ బాబు, నందితా శ్వేత
దర్శకత్వం: అనిల్ కన్నెగంటి
 

నిర్మాత: గంగపట్నం శ్రీధర్
సంగీతం: వికాస్ బాడిస
ఛాయాగ్రహణం: బి రాజశేఖర్
కూర్పు: ఎం ఆర్ వర్మ
 

బ్యానర్స్: SVK సినిమాస్
విడుదల తేదీ: 20 జులై 2023

 

ఐక్లిక్ మూవీస్ రేటింగ్‌: 2.5/5

 

ట్రైలర్ తో అందరి దృష్టిని ఆకర్షించింది ‘హిడింబ’ . అశ్విన్‌బాబు హీరోగా అనిల్ క‌న్నెగంటి తెర‌కెక్కించిన సినిమా ఇది.  ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ కి హిస్టరీ ని మిక్స్ చేసి హైబ్రీడ్ జోనర్ గా ఈ చిత్రాన్ని రూపొందించారు. ట్రైలర్ ఆకర్షించడంతో విడుదలకు ముందే మంచి బిజినెస్ జరిగింది. ఇటు ప్రేక్షకులకుని అటు మార్కెట్ ని అంతలా ఆకర్షించిన హిడింబలోని అసలు కథ ఏమిటి ? ప్రచారంలో కలిగించిన ఆసక్తిని సినిమా చూస్తున్నపుడు కలిగిందా ? అనేది తెరపై చూడాలి. 

 

కథ: న‌గ‌రంలో అమ్మాయిల సీరియ‌ల్ కిడ్నాప్‌ల‌కు గురౌతుంటారు. దీన్ని ఇన్వెస్టిగేట్  చేయడానికి  అభ‌య్ (అశ్విన్‌బాబు), ఆద్య (నందితా శ్వేత‌) రంగంలో దిగుతారు. వీరిద్దరూ పోలీస్ శిక్ష‌ణ‌లో ఉండ‌గా ప్రేమించుకుంటారు. కానీ, కొన్ని కార‌ణాల వ‌ల్ల ఇద్ద‌రూ విడిపోతారు. ఆ త‌ర్వాత ఆద్య ఐపీఎస్ ఆఫీస‌ర్ అవుతుంది. అభ‌య్ మాత్రం హైదరాబాద్‌లో పోలీస్‌ అధికారిగా పనిచేస్తుంటాడు. వీళ్లిద్ద‌రూ సీరియల్ కిడ్నాప్ కేసుని చేధించడానికి టీం గా పనిచేస్తారు. కేసు విచారణలో  కాలా బండ‌లోని బోయ అనే క‌రుడుగ‌ట్టిన ముఠాను ప‌ట్టుకుంటారు. అక్కడ అమ్మాయిలంద‌రినీ విడిపిస్తారు. ఈ కేసు ఇక ముగిసిన‌ట్లే అనుకుంటున్న త‌రుణంలో న‌గ‌రంలో మ‌ళ్లీ మ‌రో అమ్మాయి కిడ్నాప్ అవుతుంది. దీంతో కేసు మళ్లీ మొద‌టికొస్తుంది. బోయ పోలీస్ క‌స్ట‌డీలోనే ఉండ‌గా.. ఈ కిడ్నాప్ ఎలా సాధ్య‌మైంద‌ని ఆలోచిస్తున్న‌ప్పుడు అంత‌కు ముందు క‌నిపించ‌కుండా పోయిన అమ్మాయిలు ఇత‌ని చెర నుంచి విడిపించిన యువ‌తులు వేర‌ని తెలుస్తుంది. అదే స‌మ‌యంలో అస‌లు కిడ్నాపర్ రెడ్ డ్రెస్ వేసుకున్న అమ్మాయిల్నే ల‌క్ష్యం చేసుకుంటున్న‌ట్లు ఆద్య క‌నిపెడుతుంది. ఈ క్లూతో ఈ కేసును ఆద్య‌, అభ‌య్ ఎలా ఛేదించారు? అస‌లు ఈ కిడ్నాప్‌లు చేస్తున్నది ఎవరు? అత‌ను రెడ్ డ్రెస్ వేసుకున్న అమ్మాయిల్నే ల‌క్ష్యం చేసుకోవ‌డానికి కార‌ణ‌మేంటి? ఈ క‌థ‌కు అండ‌మాన్ దీవుల్లో ఉన్న ఓ తెగ‌కు ఉన్న సంబంధం ఏంటి? అభయ్, ఆధ్య గతంలో ఎందుకు విడిపోయారు ? అనేది తక్కిన కథ.

 

విశ్లేషణ: ఈమధ్య కాలంలో ట్రైలర్ తో ఎక్సయిట్ మెంట్ పెంచిన సినిమాలో హిడింబ ఒకటి. ఐతే ట్రైలర్ లో వున్న క్యురియాసిటీ  సినిమా చుస్తునప్పుడు మాత్రం కలగదు.  డైరెక్టర్ దగ్గర ఒక యునిక్ పాయింట్ ఐతే వుంది. ఇన్వెస్టిగేటివ్‌  థ్రిల్లర్ , హిస్టరిని మిక్స్ చేసి ఆడియన్స్ ని థ్రిల్ చేయాలనుకున్నారు. పాయింట్ పరంగా ఫ్రెష్ నెస్ వుంది కానీ ఎగ్జిక్యుషన్ లో కొన్ని లోపాలు కనిపించాయి. ఇదొక హైబ్రీడ్ జోనర్ సినిమా.  ఇన్వెస్టిగేషన్, హిస్టరీ రెండూవున్నాయి. ఐతే ఇందులో  ఇన్వెస్టిగేషన్ ఆడియన్స్ కి పెద్ద కిక్క్ ఇవ్వదు.  ప్రొసీడింగ్స్ లేజీగా వుంటాయి. ఇంటర్వెల్ బాంగ్ వరకూ సినిమాని సాగదీసినట్లుగానే వుంటుంది. కాలాబండా ఎపిసోడ్ మాత్రం కొంచెం డిఫరెంట్ గా యాక్షన్ డోసు పెంచి తీశారు.  

 

సెకండ్ హాఫ్ లో  అసలు పాయింట్ స్టార్ట్ అవుతుంది. అండమాన్ లోని తెగ గురించి వచ్చే సీన్స్ ఆసక్తికరంగా వుంటాయి. ఐతే ఆ హిస్టరీని ఈ కథలో బ్లెండ్ చేసిన విధానం మాత్రం  సరిగ్గా కుదరలేదు.  అలాగే కేరళలో  జరిగే ఇన్వెస్ట్ గేషణ్ కూడా సాగదీతగా వుంటుంది. ఇక ఈ సినిమాలో ఒక ఫైనల్ ట్విస్ట్ వుంది. ఐతే సినిమా కలర్ గ్రేడింగ్ ని సరిగ్గా పరిశీలిస్తే ఆ ట్విస్ట్ ప్రేక్షకులు ఊహకు ముందే అందిపోతుంది. ఎక్కడా రాయని ఒక సంఘటనకు కొంత ఊహ జోడించి థ్రిల్లర్ గా మలచాలనుకున్నాడు దర్శకుడు. అది అ ఉకున్నంత థ్రిల్ అయితే ఇవ్వదు. పైగా ఇందులో ఆర్గాన్ మాఫియా గురించి కూడా ఒక కోణం వుంది. అది అంతగా రిజిస్టర్ అవ్వదు.

 

నటీనటులు: ఈ పాత్ర కోసం అశ్విన్ బాబు చాలా కష్టపడ్డాడు. బాహుబలి లాంటి బాడీ పెంచాడు. ఫైట్స్ బాగా చేశాడు.తన నటన కూడా మెప్పిస్తుంది.  నందిత శ్వేతా పాత్రని ఎందుకో సాఫ్ట్ గా మార్చేశారు. ఆమె ఒక పవర్ ఫుల్ పోలీస్ లా అనిపించదు.   క్లైమాక్స్ లో తప్పితే ఆమెకు ఎక్కడా నటించే అవకాశం లేదు. మ‌క‌రంద్ దేశ్ పాండే పాత్ర  కీలకంగా వుంటుంది  ర‌ఘు కుంచె, సంజ‌య్ స్వ‌రూప్‌, షిజ్జు, శ్రీనివాస్ రెడ్డి, రాజీవ్ పిళ్లై త‌దిత‌రుల పాత్ర‌లు ప‌రిధి మేర‌కు ఉంటాయి.

 

టెక్నికల్ : నేపధ్య సంగీతం కంటెంట్ కు తగ్గట్టు చాలా హెవీ అండ్ లౌడ్ గా చేశారు. కెమరాపనితనం మెప్పిస్తుంది. ఎడిటింగ్ విషయానికి వస్తే కేజీఎఫ్ స్టయిల్ లో కొన్ని సీన్స్ ని ఎడిట్ చేయాలనుకునే ఉత్సాహం కనిపించింది. ఐతే ఈ సినిమాకి అది అనవసరం. ద‌ర్శ‌కుడు ఎంచుకున్న పాయింట్ లో కొత్తదనం వుంది కానీ దాన్ని తెర‌పై చూపించ‌డంలో త‌డ‌బబాటు కనిపించింది. అన్నట్టు ఈ సినిమాలో తీవ్రమైన రక్త పాతం హింస వుంటాయి, సెన్సార్ సర్టిఫికేట్ ప్రకారం పిల్లలు, సున్నిత మనస్కులు సినిమాకి దూరంగా వుండటం బెటర్. 

 

ప్లస్ పాయింట్స్ 
కథా నేపధ్యం 
ట్విస్ట్ 
నిర్మాణ విలువలు 

 

మైనస్ పాయింట్స్ 
ఫస్ట్ హాఫ్ 
థ్రిలింగ్ ఎలిమెంట్స్ లేకపోవడం 
ఆకట్టుకొని క్లైమాక్స్ 

 

ఫైనల్ వర్దిక్ట్ : ఓ ట్విస్ట్ కోసం ‘హిడింబ’...


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS