ప్రముఖ నటి, నగరి ఎమ్.ఎల్.ఏ రోజా చిక్కుల్లో పడ్డారు. లాక్ డౌన్ నిబంధనలకు వ్యతిరేకంగా ప్రవర్తించినందుకు ఆమె హైకోర్టు నోటీసులు అందుకోవాల్సివచ్చింది. ఇటీవల ఓ బోరింగు పంపు ప్రారంభోత్సవానికి రోజా చేసిన హడావుడి సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. అనుచరులతో పూలు చల్లించుకోవడం, జనాన్ని ప్రోగు చేయడం - వివాదాస్పదంగా మారాయి. లాక్ డౌన్ నిబంధనలు సామాన్యులకేనా? శాసన సభ్యులకు ఉండవా? అంటూ ప్రతిపక్షాలు ఘాటుగా విమర్శించాయి. న్యూస్‌ఛానళ్లలోనూ ఈ వార్త హైలెట్ అయ్యింది.
ఇప్పుడు రోజా అందుకు మూల్యం చెల్లించుకోవాల్సివచ్చింది. ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు లాక్ డౌన్ నిబంధనల్ని పాటించనందుకు రోజాకు నోటీసులు జారీ చేసింది. దీనిపై వారం లోగా కౌంటరు దాఖలు చేయాలని, వివరణ ఇవ్వాలని ఆదేశించింది. రోజాతో పాటుగా మరో అయిదుగురు ఎమ్.ఎల్.ఏలు లాక్ డౌన్ నిబంధనల్ని అతిక్రమించినట్టు హైకోర్టు భావించింది. మిగిలిన నలుగురికీ నోటీసులు జారీ చేసింది.