త్రిషకి కెరీర్ పరంగా చేతినిండా సినిమాలతో సంతోషంగానే ఉన్నా ఆరేళ్ళ క్రితం నుండి ఒక కోర్టు కేసు ఆమెకి మనఃశాంతి లేకుండా చేస్తున్నది.
వివరాల్లోకి వెళితే, 2010-11 సంవత్సరానికి గాను త్రిష తన సంపాదన 89 లక్షలు అని ప్రభుత్వానికి ట్యాక్స్ కట్టింది. అయితే ఆ సంవత్సరంలో సినిమాలు చేయడానికి తీసుకున్న అడ్వాన్సులకి ట్యాక్స్ కట్టలేదు. దీనికై ఐటీ వారు ఆమెకి 1 కోటి 15 లక్షల జరిమానా విదించారు.
దీనిపై త్రిష వెంటనే స్పెషల్ ట్రిబ్యునల్ ని ఆశ్రయించగా ఆమెకి అనుకూలంగా తీర్పు వచ్చింది. అయితే ఆ తీర్పుని ఛాలెంజ్ చేస్తూ ఐటీ శాఖ మద్రాస్ హైకోర్టులో ఓ పిటీషన్ వేసింది.
ఈ పిటీషన్ జూన్ 13న విచారణకి రానుంది. దీనితో ఈ కేసులో ఎటువంటి తీర్పు వస్తుందో అన్న ఉత్కంట నెలకొంది.