ఒక్క సినిమాతోనే అందరి దృష్టినీ తనవైపుకు తిప్పుకున్నాడు బచ్చిబాబు సానా. సుకుమార్ శిష్యుడిగా `ఉప్పెన` తీశాడు. ఆ సినిమాతో గురువు మనసుని గెలుచుకున్నాడు. తొలి మూడు రోజుల్లోనే 50 కోట్ల గ్రాస్ సాధించి - రికార్డు వసూళ్ల దిశగా పరుగులు పెడుతోంది ఉప్పెన. ఈ సినిమాపై నిర్మాతలకు ముందు నుంచీ గట్టి గురి ఉంది. అందుకే ఓటీటీ ఆఫర్లు వచ్చినా ఇవ్వలేదు. థియేటర్ లోనే విడుదల చేస్తామన్నారు. దానికి తగ్గట్టే ఓపిగ్గా ఉండి, థియేటర్లు ఓపెన్ చేసే వరకూ ఎదురు చూశారు. ఇప్పుడు మంచి లాభాల్ని అందుకుంటున్నారు.
ఉప్పెన చేస్తున్నప్పుడే బుచ్చిబాబుతో మరో రెండు సినిమాలపై సంతకాలు చేయించుకున్నారు. ఉప్పెన హిట్టయినా, లేకపోయినా.. మైత్రీలో బుచ్చి మరో రెండు సినిమాలు చేయాలి. రెండో సినిమా మైత్రీలో చేసి, మూడో సినిమా మరో బ్యానర్‌లో చేయొచ్చు.కాకపోతే...మైత్రీలో మొత్తంగా మూడు సినిమాలు చేయాలి. తొలి సినిమాకి బుచ్చికి 50 లక్షల పారితోషికం ఇస్తే... మిగిలిన రెండు సినిమాలకూ ఏకంగా 4 కోట్ల వరకూ ఇవ్వనున్నట్టు టాక్.