ఓ పక్క 'సరిలేరు..' టీమ్ ప్రమోషన్స్ హోరెత్తించేస్తుంటే, మరో వైపు పోటీకి రావల్సిన 'అల వైకుంఠపురములో..' టీమ్ మాత్రం సడెన్‌గా ప్రమోషన్స్‌ని సైలెంట్ చేసేసిందంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే, సినిమా విజయంపై 'అల..' టీమ్ చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నట్లు ఇన్సైడ్ సోర్సెస్ ద్వారా అందుతోన్న సమాచారం. ఎలాగైనా సంక్రాంతి హిట్ మనదే.. అనే ధీమాతో ఉన్నారట త్రివిక్రమ్, అల్లు అర్జున్. అందుకే ప్రమోషన్స్ నుండి కాస్త గ్యాప్ తీసుకున్నారు. కానీ, ప్రమోషన్స్ కోసం ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారట. త్రివిక్రమ్ - బన్నీ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఇద్దరి కాన్ఫిడెన్స్ చూసి, వారిని ఇంటర్వ్యూ చేసిన యాంకరే ఆశ్చర్యపోయిందంటే వారి ధీమా ఏంటో అర్ధం చేసుకోవాలి.
సినిమా రిలీజ్‌కి ముందు ఉండే ఎలాంటి టెన్షన్ వారి ముఖాల్లో కానీ, మాటల్లో కానీ కనిపించకపోవడం విశేషం. ట్రైలర్ రాక ముందు వరకూ ఫ్యాన్స్‌లో కూడా ఒకింత టెన్షన్ ఉండేది. కానీ, ట్రైలర్ చూశాకా టెన్షన్స్ అన్నీ పటాపంచలైపోయాయి. ఇక పాటల సంగతి చెప్పనే అక్కర్లేదు. అన్నీ కాన్సెప్ట్ బేస్డ్ సాంగ్స్. వినసొంపైన లిరిక్స్‌తో పాటు, విజువలైజేషన్ చాలా ఆహ్లాదంగా ఉంది. ఇక బన్నీ డాన్సుల్లో గ్రేస్, కొత్తదనం ఫ్యాన్స్‌ని పిచ్చెక్కించేస్తున్నాయి. పాటల కోసమైనా ఆడియన్స్ ధియేటర్స్‌కి వస్తారంటున్నారు. ఇలా అన్ని వైపులా 'అల..'కు పోజిటివ్ వైబ్సే వస్తుండడంతో టీమ్ అంత ధీమాగా ఉందంటున్నారు. జనవరి 12న వరల్డ్ వైడ్‌గా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొస్తోంది.