ప‌వ‌న్ సినిమాకి నో డైలాగ్స్

By Gowthami - January 10, 2020 - 08:00 AM IST

మరిన్ని వార్తలు

పింక్ రీమేక్‌తో ప‌వ‌న్ క‌ల్యాణ్ మ‌ళ్లీ రీ ఎంట్రీ ఇవ్వ‌బోతున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఫిబ్ర‌వ‌రిలో మొద‌లు కానుంది. నివేదా థామ‌స్‌, అంజ‌లి, అన‌న్య కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. వేణు శ్రీ‌రామ్ ఈ చిత్రానికి ద‌ర్శ‌కుడు. ఈ సినిమాకి త్రివిక్ర‌మ్ సంభాష‌ణ‌లు అందిస్తార‌ని ముందు నుంచీ ప్ర‌చారం జ‌రుగుతోంది. ఆయ‌న స్క్రిప్టు ప‌నుల్లోనూ జోక్యం చేసుకున్నార‌ని అన్నారు. ప‌వ‌న్ - త్రివిక్ర‌మ్ మంచి స్నేహితులు. ఇద్ద‌రూ క‌లిసి మూడు సినిమాలు చేశారు. ఆ చొర‌వ‌తోనే త్రివిక్ర‌మ్ చేసి చేసుకుని ఉండొచ్చు అనుకున్నారు.

 

అయితే ఇవేం నిజం కావ‌ని తేలిపోయింది. ఈ సినిమా స్క్రిప్టుకీ, త్రివిక్ర‌మ్‌కీ అస్స‌లు సంబంధ‌మే లేద‌ట‌. ఈ సినిమాకి డైలాగులు అందించే బాధ్య‌త‌ని కూడా వేణు శ్రీ‌రామే తీసుకున్నార‌ని క్లారిటీ వ‌చ్చేసింది. త్రివిక్ర‌మ్ అల వైకుంఠ‌పుర‌ములో సినిమాతో బిజీ అయిపోయారు. ఆ ద‌శ‌లో మ‌రో సినిమాకి సంభాష‌ణ‌లు రాసే టైమ్ కూడా ఉండ‌దు. త్రివిక్ర‌మ్ ద‌గ్గ‌రకు ప్ర‌పోజ‌ల్ వెళ్లినా ఆయ‌న కాద‌ని ఉంటారు. అలాంట‌ప్పుడు ఈ వార్త ఎలా వ‌చ్చిందో మ‌రి?!


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS