తెలుగునాట ఇప్పుడు విజయ్‌దేవరకొండ హవా కొనసాగుతోంది. విజయ్ కాల్షీట్ల కోసం నిర్మాతలు ఎగబడుతున్నారు. విజయ్ కోసం కొత్త కథలు సిద్ధం అవుతున్నాయి. విజయ్ ఎంత అడిగితే అంత పారితోషికం ఇవ్వడానికి నిర్మాతలు రెడీ అంటున్నారు. ఈ క్రేజ్‌ని విజయ్ కూడా బాగానే వాడుకుంటున్నాడు. మెల్లమెల్లగా తమిళ పరిశ్రమలోనూ అడుగుపెట్టాడు. `నోటా`ని ద్విభాషా చిత్రంగా మలచి అక్కడ విడుదల చేశాడు. ఈ సినిమా ఫ్లాప్ అయ్యింది. కానీ విజయ్ ప్రయత్నాలు మాత్రం మానలేదు.
డియర్ కామ్రేడ్ సినిమాని తమిళంలోనూ విడుదల చేయాలని నిర్ణయించుకున్నాడు. అంతే గానీ, కన్నడ మలయాళ భాషల్లోనూ ఈ సినిమా విడుదల అవుతోంది. అంటే.. సౌత్ మొత్తాన్ని షేక్ చేద్దామని డిసైడ్ అయ్యాడన్నమాట. `డియర్ కామ్రేడ్` గనుక బాగా ఆడితే.. మిగిలిన భాషల్లోనూ విజయ్‌కి మార్కెట్ పెరుగుతుంది. ఇక మీదట ప్రతీ సినిమాని అన్ని భాషల్లోనూ వెళ్లేలా ప్లాన్ చేసుకోవచ్చు. దాంతో పాటూ పారితోషికాన్నీ పెంచుకోవచ్చు. ఈ ప్లాన్ ప్రకారమే తను కథల్ని ఎంచుకుంటున్నాడు. ఇటీవల విజయ్ కొత్త సినిమా `హీరో` పట్టాలెక్కింది. ఇది ఓ స్ట్రయిట్ తమిళ సినిమా స్థాయిలో విడుదల చేయాలని విజయ్ ఫిక్సయ్యాడు. విజయ్ తీరు చూస్తుంటే.. తెలుగులో పాటు అన్ని భాషల్లోనూ పాగా వేయాలని గట్టిగా డిసైడ్ అయినట్టే కనిపిస్తోంది. మరి ఈ ప్లాన్ ఎంత వరకూ వర్కవుట్ అవుతుందో చూడాలి.